Chrome 94 Released for Android, macOS, Windows మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ వుందా.? వెంటనే ఇలా చేయండీ..

Google emits chrome 94 with idle detection api to detect user inactivity amid opposition

chrome 94 google rollout update, google chrome features, google chrome android, google chrome mac macos, google chrome windows, google chrome linux, https first chrome 94, chrome 94 update, chrome 94 features, google chrome 94, google chrome, chrome, google

Chrome 94 stable update has been released by Google for Android, iOS, Mac, and Windows operating systems. The update will be rolled out over the coming weeks and it brings new security features, new functionality, and bug fixes. Google Chrome 94 stable is the first version of Chrome of the new four-week release cycle.

మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ వుందా.? వెంటనే ఇలా చేయండీ..

Posted: 09/23/2021 11:01 AM IST
Google emits chrome 94 with idle detection api to detect user inactivity amid opposition

గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా గూగుల్ క్రోమ్ ను విపరీతంగా వాడే యూజర్లకు భద్రత విషయంలో ఊరట కల్పించింది. గూగుల్ క్రోమ్ లోని బగ్స్ ను కనుగొని ఏకంగా నూతన క్రోమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. అంతేకాదు తమ యూజర్లను ప్లేస్టోర్ లోకి వెళ్లి తాజా అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్-94 అప్ డేట్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ కోత్త అప్ డేట్ వర్షన్ ను యూజర్ల ముందుకు తీసుకువచ్చింది.

 గూగుల్ యూజర్లు అందరూ అప్ డేట్ వర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ క్రోమ్ తాజా అప్ డేట్ వర్షన్ ను అండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్ ఓఎస్ తో పాటుగా లింక్స్ వర్షన్ లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గూగుల్ సంస్థ పేర్కోంది. ప్రైవసీతో పాటు కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ను అందిస్తూనే క్రోమ్-94.. తాజా వర్షన్ లో ఏకంగా 32 బగ్స్ ను సైతం ఫిక్స్ చేసిందని సంస్థ వెల్లడించింది. ఈ వర్షన్ 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం సమర్థవంతంగా ఎదుర్కోంటుందని తెలిపింది.

ఇక తమ తాజా వర్షన్ తో కాపి లింక్స్, క్యూఆర్ కోడ్ లను వైబ్ సైట్లతో పంచుకునేందుకు కూడా పూర్తి సురక్షితమైన హబ్ గా క్రోమ్ కొత్త వర్షన్ నిలువనుందని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఇది తమ హెచ్టిటిపిఎస్-ఫస్ట్ మోడ్ కి సంబంధించిన వర్షన్ అని ప్రకటించింది. దీంతో సురక్షిత రహితమైన వెబ్ సైట్లును ఓపెన్ చేసేముందు ఇన్నాళ్లు చిన్నగా కనిపించే క్రోమ్ హెచ్చరిక ఇకపై ఫుల్ పేజ్ లో కనిపిస్తుందని తెలిపింది. దీంతో యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ పేర్కోంది. ఓవైపు సేఫ్‌ బ్రౌజింగ్, వెబ్‌కోడెక్స్‌ ద్వారా మానిటర్‌, ఇతర స్క్రీన్‌లపై వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్ వేర్‌ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles