Pawan Kalyan visit rape-murder victim’s family సైదాబాద్ హత్యాచార బాధిత కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శ

Pawan kalyan visit 6 yr old rape murder victim s family in saidabad

janasena party, Pawan kalyan, Rape, Chaitra Family, Saidabad rape and murder, Saidabad murder, simgareni colony, saidabad, Raju, Hyderabad, Telangana, crime

Janasena chief Pawan Kalyan visits the family of a six-year-old child who was brutally murdered in Saidabad Singareni Basti in Hyderabad.

సైదాబాద్ హత్యాచార బాధిత కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శ

Posted: 09/15/2021 07:09 PM IST
Pawan kalyan visit 6 yr old rape murder victim s family in saidabad

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన అరేళ్ల చిన్నారి చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు. అరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘోరంపై స్పందించిన ఆయన ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న నిందితులను చట్టం సాధ్యమైనంత త్వరగా పట్టుకుని.. శిక్షించాలని డిమాండ్ చేశారు. చైత్ర కుటుంబానికి ఓదార్చిన ఆయన భారీ జన సమూహం మధ్య వారిని తన కారులో కూర్చోబెట్టుకుని వారిని పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం, పెద్దలు వారికి మద్ధతుగా ఉండాలని కోరారు. ‘మీడియాపరంగా కూడా ఇటువంటి సమస్యలు బయటకు తీసుకురావాల్సి ఉందని అన్నారు. తమ జనసేన వీర మహిళా విభాగం, విద్యార్థుల విభాగం తన దృష్టికి ఈ ధారుణ ఘటనను తీసుకొచ్చిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నిందితుడ్ని పట్టుకోవడంతో ప్రభుత్వం బాధ్యత పూర్తికాదన్న ఆయన.. తమ అరేళ్ల బిడ్డను పోగోట్టుకున్న బాధిత కుటుంబానికి ప్రభుత్వ తరపు నుంచి కూడా ఓదార్పు కావాలని కోరారు.

ప్రభుత్వం బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసు శాఖకు కూడా ఆయన విన్నవించారు. చిన్నారి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పవన్ అన్నారు. తాను కూడా ఆర్థికంగా ఆదుకుంటాననే హామీ ఇచ్చారు పవన్. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles