two month old boy died of superstitions రెండు నెలల శిశువును బలి తీసుకున్న మూడనమ్మకం..

Two month old boy died of superstitions in bhadradri kothagudem

Adivasi baby boy, baby boy died, local Doctors, karakugudem, Ashwapuram, paduvalasa, Badradri Kotagudem, Telangana, crime

In a Horriffic incident a two months baby boy is killed due to the ignorance of the adivasi people in Badradri Kothagudem district of Telangana, where the boys parents believed in superstitions rather than doctors.

రెండు నెలల శిశువును బలి తీసుకున్న మూడనమ్మకం..

Posted: 09/15/2021 05:16 PM IST
Two month old boy died of superstitions in bhadradri kothagudem

శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం ప్రపంచంలోనే మూడోస్థానానికి చేరినా.. ఇంకా దేశంలో మూడాచారాలు, మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఇటీవల ఉత్తరభారతంలోని ఓ రాష్ట్రంలో వర్షాల కోసం అక్కడి మైనర్ బాలికలను నగ్న ప్రదర్శన చేసి వరుణదేవుడికి భజనలు చేసిన ఘటన మర్చిపోకముందే తెలంగాణలోని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే నమ్ముతున్నారు. కడుపులో నొప్పి వస్తే ఆస్పత్రికి పోవాల్సింది పోయి పసరు మందు కోసం పరిగెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటున్న దారుణ పరిస్థితులు ఇంకా దేశంలో ఉన్నాయి. బంగారు తెలంగాణ దిశగా ఏడేళ్లుగా పయనిస్తున్నా.. మూడనమ్మకాలను బాపడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి.

వైద్యం పేరుతో వింత చేష్టలకు పాల్పడడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మూఢ నమ్మకం చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది. జిల్లాలోని కరకగూడెం మండలం అశ్వాపురం  పాడువలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం ఓబాబు పుట్టాడు. సోమవారం రాత్రి ఆ చిన్నారి కడుపునొప్పి వచ్చి బాధతో ఏడవ సాగాడు.  కడుపు నొప్పి తగ్గేందుకు వారు మూఢ నమ్మకాల వైపు మొగ్గు చూపారు. బాబును తీసుకుని గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని సంప్రదించారు.

అతడు బాబు బొడ్డు చుట్టూ పంటితో కొరికాడు. నొప్పితో చిన్నారి మరింత ఏడ్వసాగాడు. ఆవ్యక్తి  చిన్నారికి పసరు మందు పోశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశా కార్యకర్త  చిన్నారిని వెంటనే గుర్తించి కరకగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. పరిస్ధితి విషమించటంతో వైద్య సిబ్బంది 108 వాహనం ద్వారా భద్రాచలం ఆస్పత్రికి పంపించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా శిశువు కడుపులో చిన్న పేగు తెగినట్లు గుర్తించారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం చిన్నారి కన్ను మూశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles