I-T dept surveys 6 premises linked to Sonu Sood సోనుసూద్‌ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Income tax officials search six places linked to actor sonu sood

income tax department officials sonu sood, it dept sonu sood, it raid sonu sood, sonu sood, sonu sood news, sonu sood income tax raid, sonu sood mumbai residence, it raid, mumbai, income tax officials, sonu sood, it dept, income tax raid, sonu sood offices, mumbai residence, it raid, mumbai, Crime

The Income Tax (I-T) Department surveyed at least six premises in Mumbai and Lucknow connected to actor Sonu Sood, official sources said. The sources said the department is looking into a land deal between Sood’s firm and a real estate company in Lucknow following complaints of alleged tax evasion.

ప్రముఖ నటుడు సోనూసూద్ నివాసం, కార్యాలయంపై ఐటీ దాడులు

Posted: 09/15/2021 04:02 PM IST
Income tax officials search six places linked to actor sonu sood

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్ సినీనటుడిగానే మరీ ముఖ్యంగా ప్రతినాయుకుడిగానే చాలా మందికి తెలుసు. సూపర్ చిత్రంలో సైడ్ హీరో క్యారెక్టర్ వేసిన తరువాత ఎక్కువ చిత్రాలలో అయన విలన్ పాత్రలలో తనదైన ముద్రను వేసుకోవడంతో ఇలానే ఆయనకు గుర్తింపు. కానీ కరోనా మహమ్మారి దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న తరుణంలో తొలివిడత లాక్ డౌన్ సందర్భంలో ఆయన చేసిన సామాజిక సేవతో యావత్ భారతానికి హీరోగా పరిచయమయ్యాడు. దినసరి కూలీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు బోజన సధుపాయాలతో పాటు వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పూర్తి సహకారం అందించారు.

అంతేకాదు వారు దారిలో బోజనం చేసేందుకు వీలుగా బస్సులోనే వారికి ఆహార పోట్లాలను పార్శిల్ చేసి అందించి.. వలస కార్మికులతో పాటు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించిన వ్యక్తిగా యావత్ దేశంలోనే ఆయన హీరోగా మారారు. కాగా, తాజాగా సోనుసూద్ కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ బుధవారం తనిఖీలు చేపట్టింది. ముంబై, లోక్నోతో పాటు దేశవ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చేస్తోంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి సోనూసూద్‌ ఇటీవల బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.

సోనుసూద్‌ కొవిడ్‌ మహమ్మారి సమయంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు. గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు తరలించి రియల్‌ హీరోగా నిలిచాడు. అయితే, సోనుసూద్‌ రాజకీయాల్లోకి రానున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా ఢిల్లీ సీఎంతో భేటీ తర్వాత మరింత ఎక్కువైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐటీశాఖ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles