Farmer attempts suicide, saved by police and staff తహసీల్దార్ రిజిస్టేషన్ అడ్డుకుంటున్నారని రైతు ఆత్మహత్యయత్నం

Farmer attempts suicide saved by police and staff in tahasildar office

farmer suicide, sataiah, Tahasildar, wahidaKhathun, MRO office, land Registration, Rajender reddy, harijan narayana, Suicide, Suicide attempt, doma mandal, Vikarabad District, Telangana, crime

Timely action by a Constable, Tahasildar office staff and farmers in the office helped save the life of a farmer who attempted suicide by pouring petrol and try to self immolate himself. He alleged that Tahasildar wantedly objected his land registratiion dual times evenafter taking the slots.

తహసీల్దార్ రిజిస్టేషన్ అడ్డుకుంటున్నారని.. ఆఫీసులోనే రైతు ఆత్మహత్యాయత్నం..

Posted: 09/03/2021 11:43 AM IST
Farmer attempts suicide saved by police and staff in tahasildar office

వ్యవసాయ భూముల విషయంలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ వ్యవస్థతోనూ రైతులు మరో తరహా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. అదే సర్వేనెంబరు పరిధిలోని ఇతర భూ యజమానుల దయాదాక్షిణ్యాలపై రైతులు భూములు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారు తమకు అభ్యంతరాలు వున్నాయిని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో పిర్యదు చేస్తే చాలు.. అవసరాల కోసం భూమిని విక్రయించాలని అనుకున్న రైతులకు ఇబ్బందులు చుట్టిముట్టినట్టే. తమకు పక్కనున్న రైతు భూమిని చౌకగా కొనాలనే దురాశతో.. తమ భూమి సరిహద్దులు సరిగ్గా లేవనో, ఇక ఇత్రరాత్ర కారణాలతో తహసీల్దార్ ఆఫీసులో పిర్యాదు చేసి భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా అపవచ్చు.

తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఓ రైతు ఇదే ఇబ్బంది ఎదురైంది. దీంతో తన భూమి రిజిస్ట్రేషన్‌కు తాసిల్దార్‌ అడ్డుపడుతున్నారని రైతు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన హరిజన్‌ సత్తయ్యకు సర్వే నంబరు 43లో ఒక ఎకరా 20 గుంటల భూమి ఉన్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో ఒక ఎకర పొలం భూమిని అమ్మడానికి అగ్రిమెంట్‌ చేశాడు. అట్టి భూమిని రెండుసార్లు స్లాట్ బుక్‌ చేసుకుంటే తాసిల్దార్‌ నిలిపివేశారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తాసిల్దార్‌ వాహిదాఖతూన్ నిరాకరించింది.

అట్టి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయరాదని హరిజన్‌ నారాయణ ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని రైతు సత్తయ్య కోరగా ఆధారాలు ఏమి లేవని తేలింది. ఆధారాలు నిరూపించనప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని బాధిత రైతు తాసిల్దార్ ను నిలదీయగా డీటీకి లాగిన్‌ ఇచ్చాను చేయించుకొమ్మని తహసీల్దార్ వాహిదాఖతూన్ సమాదానం చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయంపై డీటీ రాజేందర్ రెడ్డీని వివరణ కోరగా.. తనకు ఈ విషయం తెలియదని సమాధానం చెప్పారని రైతు సత్యయ్య అకోశ్రాన్ని వ్యక్తం చేశారు.

తాసీల్దార్‌ ఉద్దేశ పూర్వకంగానే తన భూమి రిజిస్ట్రేషన్‌ ఆపుతున్నారని భావించిన ఆయన.. భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే తాను తన కుటుంబం బతికి వుండటంలోనూ అర్థం లేదని.. అవేశానికి లోనైన ఆయన.. తాను ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడతానని కూడా చెప్పినా.. తగలబెట్టుకో అని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వ్యగంగా అన్నారని బాధితుడు తెలిపారు. దీంతో బాధిత రైతు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి.. ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా రైతులు, పోలీసులు పెట్రోల్‌ డబ్బాను లాక్కున్నారు. ఈ విషయంపై డిటి రాజేందర్ రెడ్డిని వివరణ కోరగా అట్టి భూమిలో వారి వారసుల పేర్లు వచ్చాయని వారి వ్యతిరేకి ఫిర్యాదు మేరకే రిజిస్ట్రేషన్‌ చేయలేదని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధిత రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles