AP CM YS Jagan, Sharmila pay tributes to YSR వైఎస్సార్ 12వ వర్థంతి: ఘన నివాళులు అర్పించిన జగన్, షర్మిల

Ysr vardhanthi 2021 ap cm ys jagan poignant moments at ysr ghat

YS Rajashekar Reddy, Late CM of Andhra Pradesh, YS Jagan, YS Sharmila, YSR vardhanthi, People's Politician, ys jagan mohan reddy, ysr vardhanthi, ys jagan at ysr ghat today, ysr 12th death anniversary, ys jagan mohan reddy news,YSR Vardhanthi, YS Jagan Mohan Reddy, idupulapaya, Dr YSR Ghat, ysr kadapa, Dr YS Rajasekhara Reddy, Andhra Pradesh, Politics

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has paid rich tributes to his father and former Chief Minister Dr. YS Rajasekhara Reddy at YSR Ghat on his 12th death anniversary. He participated in a prayer meeting held at the YSR Ghat along with his family members, relatives, Ministers, MPs, MLAs and well-wishers.

దివంగత మహానేత వైఎస్సార్ కు.. మనఃపూర్వక నివాళులు..

Posted: 09/02/2021 04:12 PM IST
Ysr vardhanthi 2021 ap cm ys jagan poignant moments at ysr ghat

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కారించుకుని ఇవాళ ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన ఘననివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా కేవలం ఆరేళ్ల కాలంలో ఆయన అమలుపర్చిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు, పథకాలతో లబ్ది పోందిన ఎందరో రాష్ట్ర ప్రజలు కూడా ఆయనను ఇవాళ స్మరించుకుంటున్నారు. ఫీజు రియంబర్స్ మెంటు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకం సహా అనేక పథకాలతో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజల్లో ఇప్పటికీ.. ఎప్పటికీ చెరగని ముద్రవేశారు దివంగత మహానేత.

అటు రాజకీయాల్లోనూ ఆయన తనదైన శైలితో వ్యవహరించారు. అస్మదీయులతో పాటు తస్మదీయులను కూడా చేరదీసి.. వారితో కలసి నడిచిన నేత వైఎస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టేసిందన్న తరుణంలో తెరపైకి వచ్చిన ఆయన ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ మహాపాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రి ఆయన తరువాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా వున్న కార్పోరేట్ వైద్యంతో పాటు కార్పోరేట్ సహా ఖరీదైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా లక్షలాది మంది గుండెల్లో గుడి కట్టుకున్న మహానేతకు ప్రజలు.. నివాళులు అర్పించారు.

ఈ మహానేత 12వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు ఈ ఉదయం చేరుకున్న జగన్, షర్మిల, వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌కు నివాళులు అర్పించిన వారిలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఉన్నారు. అంతకుముందు జగన్ ట్వీట్ చేస్తూ.. తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారని, వారి హృదయాల్లో కొలువై ఉన్నారని పేర్కొన్నారు. తన ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని అన్నారు.

కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయ‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద‌ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేసిన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. 'ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది. ఐ లవ్, అండ్ మిస్ యూ డ్యాడ్' అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles