సినీనటుడు దివంగత హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా ఆయనను గుర్తుచేసుకుని ఆయనకు నివాళులు అర్పిరస్తున్నారు. నందమూరి తారకరామారావు నట, రాజకీయ వారసుడు హరికృష్ణ అనేక మంది మనసులు గెలుచుకున్నారు. తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నిలిచిన నందమూరి హరికృష్ణ ‘శ్రీకృష్ణావతారం’లో నటించి అలరించారు. నటుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాలలోను సత్తా చాటారు.
తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మరణానంతరం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపోందారు. 'అటు సినీరంగంలోనూ రాణించారు. సీతయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ఎవరి మాట వినడు సీతయ్య అంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తమ తండ్రిని స్మరించుకుని ఆయనకు ఘననివాళులు అర్పించారు. 'ఈ అస్థిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే' అంటూ ఆయన కుమారులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
మీ 65వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ...Miss You Nanna! pic.twitter.com/MJwwAz7wLk
— Jr NTR (@tarak9999) September 2, 2021
నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన హరికృష్ణ జ్ఞాపకాలను, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 'కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ల ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామన్న భయాందోళన మధ్య కరోనా తొలి దశలో దేశప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించారు. అయినా భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా నమోదు కావడంతో దేశప్రజల్లో మరింత అందోళన... Read more
May 17 | ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది.... Read more
May 16 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన బీజేపీ రాష్ట్రస్థాయి నేతపై దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది.... Read more
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more