Sexual Act with Wife not Rape even If by Force: Chhattisgarh HC భార్యతో బలవంతపు శృంగారం నేరం కాదు: హైకోర్టు

Sexual intercourse between man and wife is not rape even if by force chhattisgarh hc

Chattisgarh High Court, Chhattisgarh HC, marital rape, rape, sec 377, cruelty, sexual intercourse with wife by husband not rape, sexual intercourse, Wife, marital rape, Sexual intercourse by force not rape, Sex between married couple not marital rape, crime

The Chhattisgarh High Court has discharged a man of the offence of marital rape after observing that sexual intercourse or any sexual act by a husband with his legally wedded wife is not rape even if it was by force or against her wish.

భార్యతో బలవంతపు లైంగిక సంపర్కం నేరం కాదు: చత్తీస్ గఢ్ హైకోర్టు

Posted: 08/26/2021 04:44 PM IST
Sexual intercourse between man and wife is not rape even if by force chhattisgarh hc

హిందూ వివాహంతో ఒక్క‌టైన భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య శృంగారం నేరం కాదు అని, ఒక‌వేళ ఇద్దరి మధ్య బ‌ల‌వంతంగా లైంగిక సంపర్కం జరిగినా అది నేరంగా పరిగణించలేమని.. దానిని అత్యాచారంగా కూడా పరిగణించరాదని చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు తీర్పులో పేర్కొన్న‌ది. ఈ మేరకు ఓ వ్యక్తిపై ఆతని భార్య మోపిని అత్యాచారఅభియోగాలను న్యాయస్థానం కోట్టివేసింది. ఆ కేసులో స‌ద‌రు భ‌ర్త‌కు అత్యాచారం సెక్షన్ నుంచి విముక్తి క‌ల్పించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ భార్య కోరిక‌కు విరుద్ధంగా భ‌ర్త శృంగారం చేసినా త‌ప్పు కాదు అని కోర్టు తేల్చిచెప్పింది.

ఇటీవల ముంబై హైకోర్టు వెలువరించిన తీర్పునే చత్తీస్ గడ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. అయితే భార్య వ‌య‌సు 18 ఏళ్ల లోపు కాకుంటే, అప్పుడు భ‌ర్త‌తో జ‌రిగిన బ‌ల‌వంతపు శృంగారం అత్యాచారం కాదు అని చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కాగా, భార్యతో అసహజరీతిలో లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడని అభియోగాల నేపథ్యంలో భర్తపై సెక్షన్ 377 కింద కేసులను అలానే ఉంచింది. మహిళ తన భర్తతో పాటు తన అత్తమామలపై వరకట్నం కోసం తనను మానసిక, శారీరిక హింసకు గురిచేశారని అరోపించింది.

ఇక తన భర్త తనతో అసహజమైన రీతిలో లైంగిక సంపర్కం చేశారని నిర్దిష్ట ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కేసు తీర్పును వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కే చంద్రవంశీ.. "18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న భార్యతో లైంగిక సంబంధం లేదా లైంగిక చర్య అత్యాచారం కాదు" అని అన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు దరఖాస్తుదారుడి యొక్క చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య, కాబట్టి, లైంగిక సంపర్కం లేదా ,లైంగిక చర్య అది బలవంతంగా చేసినా.. లేదా ఆమె కోరికకు వ్యతిరేకంగా అయినా అత్యాచార నేరం కాదు "అని న్యాయమూర్తి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles