President Notifies Appointment Of SC Judges సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు రాష్ట్రపతి అమోదం

President notifies appointment of nine supreme court judges including 3 women

Chief Justice of India CJI, NV Ramana, collegium recommendations, supreme court, CJI, NV Ramana, SC collegium, Supreme Court, Judges appointment, Nine Supreme Court Judges Appoinment, Three Women Judges, 1. Mr. Justice A.S. Oka, Chief Justice, Karnataka High Court 2. Mr. Justice Vikram Nath, Chief Justice, Gujarat High Court 3. Mr. Justice J.K. Maheshwari, Chief Justice, Sikkim High Court 4. Ms. Justice Hima Kohli, Chief Justice, Telangana High Court 5. Mrs. Justice B.V. Nagarathna, Judge, Karnataka High Court 6. Mr. Justice C.T. Ravikumar, Judge, Kerala High Court 7. Mr. Justice M.M. Sundresh, Judge, Madras High Court 8. Ms. Justice Bela M. Trivedi, Judge, Gujarat High Court, and 9. Mr. P.S. Narasimha, Senior Advocate

Accepting the recommendations made by the Supreme Court collegium, the President of India has notified the appointment of nine Judges including three women and one lawyer to the Supreme Court of India.

కొలిజియం సిఫార్సులకు రాష్ట్రపతి అమోదం.. 9 మంది సుప్రీం జడ్జీల నియామయం

Posted: 08/26/2021 03:51 PM IST
President notifies appointment of nine supreme court judges including 3 women

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది కొత్త జడ్జీల నియామకాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమోదం తెలిపారు. దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతత్వంలో.. జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖన్ విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్; జస్టిస్ ఎల్ నాగేశ్వర రావులతో కూడిన సుప్రీంకోర్టు కోలిజియం వీరిని సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కొలిజీయం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాజాగా ఈ 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా అమెదం తెలిపారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులలో మొత్తం 9 మంది న్యాయమూర్తులు ఉండగా, వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు కూడా స్థానం దక్కింది. ఈ మేరకు ఈ సిఫారసులను కేంద్రం అనుమతించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారి నియమాకం ఫైలుపై సంతకం చేశారు. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులవుతున్న న్యాయమూర్తుల్లో .. సీనియర్‌ న్యాయమూర్తి బీవీ నాగరత్న కూడా ఉన్నారు. ఈమె 2027 సెప్టెంబర్‌ నెలలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్‌ బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు.

మిగిలిన వారిలో బేలా ఎం త్రివేది, హిమకోహ్లీ, సీటీ రవికుమార్‌, ఎంఎం సుందరేశ్‌, మాజీ అదనపు సాలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నరసింహ, అభయ్‌ శ్రీనివాస్‌ ఓక, విక్రమ్‌నాథ్‌, జితేంద్ర కుమార్‌ మహేశ్వరి కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపుగా రెండేళ్ల తరువాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం జరిగింది. సెప్టెంబర్ 2019లో జడ్జీల నియామకం తరువాత 2021లో వీరి నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు కేవలం 24 మంది న్యాయమూర్తులే సేవలు అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం 9 మంది నియామకాలతో నిర్ధేశిత 34 మంది న్యాయమూర్తులకు ఒక్క స్థానం తక్కువగా న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles