Afghanistan’s Former Minister Now Works As Delivery Boy నిన్నటి వరకు దేశానికి ఐటీ మినిస్టర్.. నేడు పిజ్జా డెలివరీ బాయ్.!

Afghan s former it minister works pizza delivery professional in germany

Syed Ahmed Shah Sadat, Former Afghanistan minister Syed Ahmed Shah Sadat, Former Afghan minister Syed Ahmed Shah Sadat, Former Afghan minister delivers Pizza, fghan minister delivers Leipzig, Former Afghanistan Minister,Germany,Leipzig,Live Breaking News Headlines,Pizza,Pizza Delivery,Syed Sadat

Fearing Taliban's bloody agenda in Afghanistan, former Afghan minister Syed Ahmed Shah Sadat had letft the country years ago. Sadat, who was Communications Minister in Afghanistan, has now taken refuge in Leipzig city of Germany where he is working as a food delivery guy. According to a report in the Leipziger Volkszeitung newspaper, Sadat is working as a food delivery boy in the German city of Leipzig.

నిన్నటి వరకు దేశానికి ఐటీ మినిస్టర్.. నేడు పిజ్జా డెలివరీ బాయ్.!

Posted: 08/25/2021 12:24 PM IST
Afghan s former it minister works pizza delivery professional in germany

ఆయన ఓ దేశానికి మంత్రిగా వ్యవహరించారు. తన శాఖ పరిధిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్న విషయమై ప్రణాళికలు అమలయ్యేలా చూసిన ఆ అమాత్యులు.. ఇప్పుడు మరో దేశానికి వలస వెళ్లారు. అక్కడ ఆయన తన బతుకుదెరువు కోసం మరో దేశంలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఈయన మరెవరో కాదు.. ఆఫ్ఘనిస్తాన్‌ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌. జర్మన్‌ నగరమైన లీప్‌జిగ్‌లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఈయన.. పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్‌ వశం కాగానే ఆ దేశాధ్యక్షుడితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. అక్కడి ఐటీ శాఖ మంత్రి అయిన సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌ కూడా కుటుంబ సమేతంగా జర్మనీకి వెళ్లారు. అక్కడ లీప్‌జిగ్‌ నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సాదత్‌.. కుటుంబపోషణ కోసం పిజ్జాలు అందించే ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో మొబైల్ ఫోన్‌ నెట్‌వర్క్ ను విజయవంతంగా తీసుకువచ్చిన మంత్రిగా దేశవ్యాప్తంగా సాదత్‌ అభినందనలు అందుకున్నారు.

ఇలాఉండగా, గత ప్రభుత్వంతో పొసగని కారణంగా కొంతకాలం క్రితమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అల్ జజీరా ట్విట్టర్‌ ద్వారా నివేదించింది. కొద్దిరోజుల పాటు అక్కడే ఉన్న సాదత్‌.. ఆఫ్ఘాన్ ను తాలిబాన్‌ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి వారం ముందు జర్మనీకి వలసవెళ్లినట్లు పేర్కొన్నది. చేతిలో సరిపోయేంత డబ్బు లేకపోవడంతో పిజ్జాలు డెలివరీ చేసే పనిని ఎంచుకున్నానని, ఈ పని చేయడం వల్ల తానేమీ ఫీలవడం లేదని, తన కుటుంబాన్ని ఇలా అయనా పోషించుకుంటున్నందుకు తాను సంతోషపడుతున్నానని సాదత్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Ahmed Shah Sadat  IT Minister  Pizza delivery  Afghanistan  Germany  AlJazeera channel  

Other Articles