Union Minister Narayan Rane granted bail అరెస్టైన కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్

Arrest justified maharashtra court while granting bail to narayan rane

Narayan Rane , Sangameshwar, Ratnagiri police , Uddhav Thackeray, nashik police, slap remark, union minister, FIR, BJP, shiv sena, clash, arrest, bail granted, mahad, bombay high court, maharashtra, crime, Politics

The arrest of Union Minister Narayan Rane was "justified", but it was not necessary "to hand over the accused in police custody", a magistrate's court in Mahad said in its order, while granting bail to the Bharatiya Janata Party (BJP) leader.

కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్.. అరెస్టును సమర్థించిన న్యాయస్థానం

Posted: 08/25/2021 11:32 AM IST
Arrest justified maharashtra court while granting bail to narayan rane

భారతమాత దాస్యశృంఖాలాలు తెగిపోయి.. దేశప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం ఏదో కూడా తెలియని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెంప పగలగొట్టాలని వ్యాఖ్యానించి తీవ్ర దుమారం రేపిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్రలోని రత్నగిరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల అరెస్టు సబబే అన్న న్యాయస్థానం అయనను పోలీసుల కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. కాగా నిన్న అర్థరాత్రి కేంద్రమంత్రి దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన రాయ్ గఢ్ లోని మహద్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

రాణే అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని, ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన న్యాయస్థానం రాణేకు బెయిలు మంజూరు చేసింది. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించిన నారాయణ్ రాణే మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నాళ్లయిందో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదని, అలాంటి వ్యక్తిని పట్టుకుని చెంప పగలగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేసు నమోదైంది. నిన్న ఆయన రత్నగిరి పర్యటనలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles