Woman falls under moving train, rescued కదులుతున్న రైలు ఎక్కబోయి పడిన మహిళకు తప్పిన ప్రమాదం..

Cctv footage woman falls under moving train rescued

woman, moving train, Indore woman falls while boarding moving train, Woman trying to board moving train falls video, Moving train, Woman passenger, passenger rescued, train accident, train accident, indore railway station, cctv footage, Madhya pradesh, Crime

In a shocking incident, a woman had a narrow escape from a major accident after she slipped while boarding a moving train in Indore railway station on August 17. According to the officials, the lady passenger was trying to board the train along with a man and a child.

ITEMVIDEOS: కదులుతున్న రైలు ఎక్కబోయి పడిన మహిళ.. కాపాడిన ప్రయాణికులు

Posted: 08/19/2021 12:53 PM IST
Cctv footage woman falls under moving train rescued

రైలు బండి నిలబడినప్పుడే ఎక్కాలని ఓ వైపు రైల్వే అధికారులు ప్రతీ స్టేషన్లో పెద్ద పెద్ద మైకుల్లో చెబుతున్నా.. రైలు మరికొద్ది నిమిషాలలో కదులుతుంది అన్నప్పపుడు మాత్రమే రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడటం సర్వసాధారణం. అయితే ఇలానే చేసిన ఓ మహిళా ప్రయాణికురాలికి తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించిన అమె రైలును ఎక్కే చివరి క్షణంలో కిందపడిపోయింది. అయితే అక్కడే వున్న సహ ప్రయాణికులు అమెను చూసి వెనువెంటనే అప్రమత్తతతో వ్యవహరించడంతో అమె బయటపడింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని రైల్వేస్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త.. పిలల్లతో ఇండర్ రైల్వే స్టేషన్ లోకి వచ్చిన మహిళా ప్రయాణికురాలు.. రైలు ఎక్కేందుక వచ్చారు. అయితే అమె భర్త లగేజీతో పాటు పిల్లలను తీసుకుని రైలు ఎక్కాడు. ఇంతలో రైలు కదిలింది. దీంతో అ మహిళ కూడా కదులుతున్న రైలు ఎక్కబోయింది. అయితే అప్పటికే వేగాన్ని అందుకోవడంతో మహిళ జారీ కిందపడింది. అమె పడటాన్ని అక్కడే వున్న తండ్రీ కూతుళ్లు గమనించారు. వెంటనే అప్రమత్తతతో వ్యవహరించి.. మహిళా ప్రయాణికురాలని ఆర్పీఎప్ సిబ్బంది తరహాలోనే వెనక్కి లాగారు. ఈ ఘటనతో అక్కడే వున్న రైల్వే పోలీసులతో పాటు సహప్రయాణికులు కూడా పరుగుపరుగున వచ్చారు.

సహ ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మహిళా ప్రయాణికురాలు స్వల్పగాయాలతో బయటపడింది. ఈలోగా రైలులోపల వున్న ప్రయాణికులు కూడా అమెను గమనించి వెంటనే చైన్ లాగారు. దీంతో రైలు కూడా నిలిచిపోయింది. మంగళవారం జరిగి ఈ సంఘటనపై రైల్వే పీఆర్వో ఖేమ్ రాజ్ మీనా స్పందించారు. మహిళా ప్రయాణికురాలు సురక్షితంగా వుందని అన్నారు. సహ-ప్రయాణీకుల అలర్ట్ గా ఉండటం కారణంగా మహిళ ప్రాణాలతో బయటపడిందని.. కదులుతున్న రైలు ఎక్కడం ప్రమాదకరమని ఈ తరహా చర్యలకు ప్రయాణికులు చేపట్టరాదని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles