Banks have to pay fines if ATMs run out of cash ఏటీయంలో డబ్బులు లేకపోతే.. బ్యాంకులకు జరిమానా.!

Rbi to penalise banks for non availability of cash in atms

Reserve Bank of India, RBI, ATM, bank ATM, no cash in ATMs, Urban Co-operative bank, Gadhinglaj Urban Co-operative bank, Dr. Babasaheb Ambedkar Urban Co-operative bank, Malkapur Urban Co-operative bank, ATM centres, Latest News

Concerned over the inconvenience caused to the public due to the non-availability of cash in ATMs, the Reserve Bank has decided to penalise banks for failure to timely replenish currency notes in such machines. The RBI will start imposing penalty on banks in case the ATMs remain out-of-cash for a total period of 10 hours in a month from October 1, 2021, onwards.

ఏటీయంలో డబ్బులు లేకపోతే.. బ్యాంకులకు జరిమానా.!

Posted: 08/11/2021 04:59 PM IST
Rbi to penalise banks for non availability of cash in atms

బ్యాంకు ఖాతాదారులపై ఇబ్బడిముబ్బడిగా జరిమానాలు విధించి.. వాటిని ముక్కుపిండి వసూళ్లు చేస్తూ.. గత కొద్ది రోజుల క్రితం వరకు ఆనందాన్ని పోందిన బ్యాంకులకు ఇప్పడు అదే పరిస్థితి ఎదురైంది. ఇన్నాళ్లు తాము విధించే జరిమానాలే కానీ కట్టే జరిమానా అన్నది లేకపోవడంతో ఎగిరెగిరి పడ్డ బ్యాంకులు ఇప్పుడెలా రియాక్ట్ అవుతాయో చూడాల్సిందే. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదని నెల నెలా అందుకు జరిమానా విధించిన బ్యాంకులకు.. ఇప్పుడు తాము కూడా జరిమానా కట్టేలనే నిబంధన అములోకి వస్తుండటంతో మింగుడుపడటం లేదు.

అదేంటి బ్యాంకులు జరిమానాలు కట్టాలా.? ఎందుకని..? ఎవరికి అన్న సందేహాలు అనేకం మీలో ఉత్పన్నం అవుతున్నాయా.?. ఏటీయం కేంద్రాలలో నగదు లేకుండా.. ‘‘నో క్యాఫ్’’ లేదా ‘‘టెంపరర్లీ అవుట్ ఆఫ్ సర్వీస్’’ ఇలాంటి బోర్డులు దర్శనమిస్తే.. సదరు బ్యాంకుకు ఇకపై రిజర్వు బ్యాంకు జరిమానా విధించనుంది.? ఈ బోర్డులు దర్శనం ఇవ్వకపోయినా సరే.. ఏటీయం కేంద్రంలో డబ్బులు లేని పక్షంలో జరిమానా వడ్డించినట్టే. ఔనండీ.. ఏటీఎంలలో నగదు నింపకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) షాకిచ్చింది. ఇకపై ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించింది.

ఏటీఎంలలో నగదు లేని సమయం ఒక నెలలో 10 గంటలు దాటితే రూ. 10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించిన ఆర్‌బీఐ.. అక్టోబరు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఖాళీ అయినా నగదు నింపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా ఆర్‌బీఐ పేర్కొంది. కాబట్టి నోట్ల లభ్యతను పర్యవేక్షించే బాధ్యతను బలోపేతం చేసుకోవాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే వాటికి డబ్బు అందజేసే బాధ్యత కలిగిన బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్‌బీఐ హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles