Huzurabad Bypolls: Gellu Srinivas gets TRS Ticket హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

Ruling trs huzurabad bypolls ticket confirmed to gellu srinivas

Padi Kaushik Reddy, CM KCR, BC Candidate, Vakulabharanam Krishnamohan Rao, L Ramana, Srinivas Yadav, Peddi Reddy, Karimnagar, By-Elections, Huzurabad, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Etela Rajender, CM KCR, TRS, KTR, Telangana, Politics

Chief Minister KCR is sketching out strategies to win with the majority in the upcoming Huzurabad bypoll. TRS chief prefers G Srinivas Yadav, as the candidate for the bypoll, the Student Leader who struggled alot during seperate state-hood movement.

హుజురాబాద్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

Posted: 08/11/2021 04:05 PM IST
Ruling trs huzurabad bypolls ticket confirmed to gellu srinivas

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి చెందిన నేతను బరిలోకి దింపుతుందా.? లేక వలస వచ్చిన నేతలనే బరిలోకి దింపుతుందా.? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యమున్న సోంతపార్టీ నేతలను పక్కనబెట్టి.. వలస నేతలకు ప్రాధాన్యం ఇస్తుందన్న అపవాదును ఈ ఉప ఎన్నికలలో బాపుకోవాలని పార్టీ యత్నిస్తుందా.? అంటే ఔననే చెప్పాలి. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీలోని విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ ఉపఎన్నికల బరిలోకి దింపింది.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం పేరుతో మంత్రి పదవికి, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో బీజేపి పార్టీలో చేరిన ఈటెల రాజేందర్.. ఆదే పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతుండగా, ఈ స్థానం నుంచి స్థానిక నేతను.. అందులోనూ బీసీ వర్గాలనికి చెందిన నేతను బరిలోకి దింపాలన్న పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచించినట్టుగానే యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది.

బిసి విద్యార్థి హక్కుల కోసం ఉధ్యమించిన యువనాయకుడిగా, తెలంగణ మలిదశ ఉద్యమంలో పాల్గోన్న నేతగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కోంటున్నాడు. దీంతో ఆయనను హుజూరాబాద్ ఉపఎన్నికలలో ఈటెలపై బరిలోకి దింపిన అధిష్టానం,, ద‌ళిత బంధు ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నుంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు గులాబీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  L Ramana  Srinivas Yadav  Peddi Reddy  By-Elections  Huzurabad  Etela Rajender  Telangana  Politics  

Other Articles