Marriage Between Muslims And Non-Muslims Regretful ముస్లిమేతరులతో వివాహాలు చట్టబద్దం కావు: ముస్లిం లా బోర్డు

Muslim s marriage with non muslim is wrong absurd decree of muslim personal law board

All India Muslim Personal Law Board, AIMPLB, Inter-faith Marriage, Sharia Laws, Muslim intellectuals, Khap Panchayat

The All India Muslim Personal Law Board said that the marriage of Muslims in another religion is un-Islamic. To prevent this, parents should keep a close watch on children's mobiles. Girls should not be taught in co-ed schools. All Muslim intellectuals say that the Muslim Personal Law Board has acted exactly like a Khap Panchayat.

ముస్లిమేతరులతో వివాహాలు చట్టబద్దం కావు: ముస్లిం పర్సనల్ లా బోర్డు

Posted: 08/07/2021 08:31 PM IST
Muslim s marriage with non muslim is wrong absurd decree of muslim personal law board

ఓ వైపు ముస్లింలు హిందువులతో పాటు క్రైస్తవులను ప్రేమించి వారిని తమ మతంలోకి మార్చుకుని లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారన్న అరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఇలాంటి వివాహాలపై సంచలన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. షరియా చట్టం ప్రకారం ఇలాంటి వివాహాలు అసలు చట్టబద్దమే కాదని అంటున్నారు ముస్లిం మదపెద్దలు, ముస్లిం చట్ట నిపుణులు. ముస్లింతో మరో ముస్లిమేతర యువతికి వివాహం చేసినా అది దురదృష్టవశాత్తు చట్టబద్ధం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెప్తుంది.

ఈ మేరకు ఏడు పాయింట్ల సూచనలిస్తూ కామెంట్ చేసింది. మొబైల్ ఫోన్స్ పిల్లలకు ఇస్తూ వారిపై ఓ కన్నేయాలని చెప్పింది. అంతేకాకుండా పిల్లలను కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో వేయకూడదని చెప్పింది. అటువంటి పెళ్లిళ్లు షరియా చట్ట ప్రకారం నిషేదించారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జనరల్ సెక్రటరీ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ స్టేట్మెంట్ ఇచ్చారు. పేరెంట్స్, సంరక్షకులు, మసీదుకు ప్రతినిధులుగా ఉండేవారు, మదరసాలకు వెళ్లేవారు మతాంతర వివాహాలు అడ్డుకునేందుకు ముందడుగేయాలని చెప్పారు.

ఇస్లాంలో బహుదైవతారాధన ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని గుర్తు చేశారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా.. వ్యాలిడ్ అయినా షరియా చట్ట ప్రకారం.. లీగల్ కాదు. పేరెంట్స్ లో మతపరమైన విద్య కరువవడం వల్ల, సహద్యోగుల కల్చర్ పెరిగి.. మతాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లల పెళ్లిళ్లకు పేరెంట్స్ లేట్ చేయకూడదు. ప్రత్యేకించి పెళ్లి ఆలస్యం కావడం పెద్ద సమస్య తీసుకొస్తుంది. ఇమామ్స్, మసీదులు అటువంటి వాటిపై చర్చించి అసౌకర్యాలను తెలియజేయాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles