Sunil Yadav remanded for 14 days in YS Viveka case ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్.!

Ys vivekananda reddy murder case 14 days remand to sunil yadav

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

More than two years after the grisly murder of YS Vivekananda Reddy, the main accused in the case has been remanded for 14 days by Pulivendula court. The main accused who has been arrested in Goa had been bought by Transit Warrant and is presented in the Pulivendula court by the CBI.

వైఎస్ వివేక హత్యకేసు: ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ కు 14 రోజుల రిమాండ్.!

Posted: 08/05/2021 11:52 AM IST
Ys vivekananda reddy murder case 14 days remand to sunil yadav

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ కు కడప జిల్లాలోని పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రెండేళ్ల క్రితం జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో దాదాపుగా 50 రోజుల పాటు సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. కాగా సునీల్ యాదవ్ రిమాండ్ రిపోర్టులో సిబిఐ అధికారులు కీలక అంశాలను పోందుపర్చారు. వివేకా హత్యకేసులో సునీల్ యాదవ్ పాత్రపై కీలక అధారాలు లభించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కోనింది సీబిఐ.  

వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయన్న వార్తల నేపథ్యంలో అదృశ్యమైన సునీల్ యాదవ్ గోవాకు పారిపోగా.. అక్కడే అతన్ని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై పులివెందులక తరలించి.. ఇక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చింది సీబిఐ. వాచ్ మెన్ రంగయ్య వాంగ్మూలం మేరకు సునీల్ యాదవ్ ను సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరముందని భావించామని, అయితే విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని పారిపోయాడని సీబిఐ రిమాండ్ రిపోర్టులో పేర్కోంది.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కుట్రకోణం వివరాలు బహిర్గతం చేయడం లేదని…అడిగిన ప్రశ్నలకు అతను సహకరించడం లేదని చెప్తోంది సీబీఐ. వివేకా హత్యకేసుకు ముందు, తరువాత సునీల్ యాదవ్ కదలికలు అనుమానాస్పదంగా వున్నాయని పేర్కోంది.ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపినట్టు సమాచారం. హత్యకు వాడిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ చెప్తోంది. సునీల్ యాదవ్‌ను కస్టడీకి ఇవ్వకపోతే విచారణలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని అందుకే 13రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.

వీరితో పాటు సునీల్ కుమార్ యాదవ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రిలను సీబిఐ కర్నాటకలో అదుపులోకి తీసుకుంది. అయితే సీబిఐ అధికారుల వేధింపులు తట్టుకోలేక పారిపోయినట్టు వీరు చెబుతున్నారు. సీబిఐ తమను వేధిస్తోందని, కడప జైళ్లో పెట్టి తమను 20 రోజుల పాటు తీవ్రంగా కొట్టారని న్యాయస్థానంలో తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదని.. ఏ పని చేసుకోనీయకుండా తమను నిరంతరం చిత్రహింసలకు గురిచేస్తున్నారని అరోపించారు. అందుకనే సీబిఐ నుంచి తప్పించుకుని తిరుగుతున్నామని వారు న్యాయస్థానంలో చెప్పినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles