Drunk girl sits, sleeps, rolls on the road in Pune నడిరోడ్డుపై బొర్లుతూ.. యోగా చేస్తూ.. యువతి రచ్చ..

Video viral drunk girl sits sleeps rolls on the road in pune

Young woman, Alcohol, drunk, traffic jam, Swargate area, Hirabaug chowk, Pune, Swargate police station, Maharashtra, viral video, crime

A young woman created mayhem on the streets of Pune under the influence of alcohol. The video of the incident has gone viral on the internet in which a young lady, heavily intoxicated, was seen in the middle of a busy road in Pune city. The woman with red and black attire was seen disrupting traffic in the area for some time.

ITEMVIDEOS: మందేసి.. రోడ్డుపై బొర్లుతూ.. యోగా చేస్తూ.. యువతి రచ్చ..

Posted: 08/04/2021 09:48 PM IST
Video viral drunk girl sits sleeps rolls on the road in pune

మందేసినోళ్ల వేషాలు ఎట్టా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఇక అదే మందు కిక్కు తలకెక్కితే.. మత్తు నషాలనికి ఎక్కితే.. వారు వ్యవహరించే తీరు.. వారు మాట్లాడే మాటలు కూడా వంకర టింకరగా వస్తుంటాయి. చెప్పిందే చెప్పి.. ఎదుటివారికి చికాకు తెప్పించడంలో వీరు ఘనాపాటీలు. ఇక మరికొందరైతే గాన గంధర్వులవుతారు.. ఆ పాట నేను పాడితే ఇలా వుంటుంది.. అంటూ తమలోని టాలెంట్ ను బయటపెట్టేస్తుంటారు. ఇంకోందరి రూటే సపరేటు.. వీరంతా రెబెల్స్.. ఎదుటివారు తమను చూడకపోయినా వచ్చి తమనెందుకు చూశావ్ అంటూ నానా హంగామా చేసే బ్యాచ్. ఈ బ్యాచ్ తో మహాకష్టం.

అయితే ఇదంతా పురషపుంగములు చేసే పనులే.. వీరి చర్యలు చేస్తూనే వామ్మో అనుకుంటే.. ఇక ఈస్థానంలో మహిళలు వుంటే.. ఊహించుకోడానికే కొంత వెగటుగా వుంటుంది. ఎందకంటే మన దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం శక్తి స్థానం కాబట్టి. నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు అక్కడక్కడా కొందరు మద్యం సేవించే మహిళలు వున్నారే కానీ.. ఇలా రోడ్డుపైకి వచ్చి నానా యాగీ చేసే మహిళలు మాత్రం దాదాపుగా కనిపించరు. కానీ పూణే లో ఒక మహిళ మందేసి రోడ్డుమీదకు వచ్చి నానా రచ్చ చేసి.. వాహనాలు వెళ్లనీయకుండా ట్రాఫిక్ జామ్ కు కారణమైంది.

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పూణే లోని తిలక్ రోడ్డు   హీరాబాగ్ చౌక్ వద్ద ఓ మహిళ రోడ్డుపై కూర్చుని వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయటం మొదలెట్టింది.  ఆ సమయంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మహిళ మద్యం సేవించిందని తెలుసుకున్న   స్ధానికులు స్వర్గేట్ పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చేసరికి  ఆయువతి అక్కడినుంచి   వెళ్లిపోయింది.   కానీ యువతి చేసిన విన్యాసాలను  తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన స్ధానికులు  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు  వీడియోలు వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles