thieves attacked lonely techie in Hyderabad చందానగర్ ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో దొంగల బీభత్సం..

The anarchy of thieves in chandanagar entered inside house to get drinking water

Anarchy, Chandanagar Police Station, Sri Harsha, Software Engineer, Drinking Water, Thieves, Cyberabad Police, Hyderabad, Crime

A software Engineer SriHarsha, who was lone in the house was observed by the thives, entered enquiring about his friend, asked to get drinking water, then followed him and attacked him after tied his mouth, hand and legs. A Laptop, cash and Atm cards been stolen.

చందానగర్ ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో దొంగల బీభత్సం..

Posted: 07/31/2021 04:58 PM IST
The anarchy of thieves in chandanagar entered inside house to get drinking water

హైదరాబాదులో దొంగల అరాచకం రాజ్యమేలుతోందా.? పక్కాగా రెక్కీ నిర్వహించి పకడ్భంధీగా దోంగలు దోపిడికి యత్నించారా.? హైటెక్ సిటీకి చేరువలోని చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం చూస్తే ఔనని చెప్పకతప్పదు. ఇదివరకు ఒంటరి మహిళలు, వృద్దులను మాత్రమే టార్గెట్ చేసే దొంగలు తమ పంథాను మార్చారు. ఒంటరిగా వుంటున్న యువకులను కూడా దారుణంగా కొట్టి భయకంపితుల్ని చేసి వారింట్లోని ఖరీదైన వస్తువులను చోరీ చేసి పరారవుతున్నారు. తాజాగా చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గంగారం పరిధిలోగల ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో అదే జరిగింది.

ఎవరి కోసమే వాకాబు చేస్తున్నట్లు వచ్చి మంచినీళ్లు కావాలంటూ అడిగి.. లోపలికి ప్రవేశించి అరాచకం చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటిలోకి ప్రవేశించి కుర్చీలో కట్టేసి ఇళ్లు గుళ్ల చేసి వదిలిపెట్టారు అగంతకులు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక హుడా కాలనీ సమీపంలోని ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మామిళ్లపల్లి శ్రీహర్ష (28), అతడి స్నేహితుడు సాయిరాం ప్రసాద్ ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో స్నేహితుడు బయటకు వెళ్లగా శ్రీహర్ష ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు ఆగంతుకులు వచ్చి ‘‘ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా?’’ అని ప్రశ్నించారు.

బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉందని చెప్పడంతో.. వస్తాడు కూర్చోమని శ్రీహర్ష చెప్పాడు. అనంతరం వారు మంచినీళ్లు అడగడంతో తీసుకొచ్చేందుకు కిచెన్ లోకి వెళ్తుండగా వెనక నుంచి వెళ్లి శ్రీహర్షపై దాడిచేశారు. తలను గోడకేసి కొట్టడంతో కూలబడిపోయాడు. ఆ వెంటనే అతడి చేతుల్ని తీగలతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరోమారు దాడిచేశారు. మా అన్న జోలికి వస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని, చస్తావని వదిలేస్తున్నామని హెచ్చరించి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఓ ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, ఒక ఏటీయం కార్డుతోపాటు రూ. 3,500 నగదు తీసుకెళ్లిపోయారు.

ఆ తర్వాత రూముకు వచ్చిన సాయిరాం స్నేహితుడి కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15న స్థానికంగా నివసించే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి శ్రీహర్ష, సాయిరాంలను దూషించడమే కాకుండా దాడి చేసి కొట్టాడు. దీంతో బాధితులు అదే రోజు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles