House in Argentina collapses into the ocean సముద్రంలో కుప్పకూలిన రెండంతస్థుల భవనం

Watch terrifying incident of two storey building collapsing into sea

Global warming, sea levels rising, two storeyed building, south Atlantic Ocean, Mar Del Tuyu, Buenos Aires, Argentina, Viral news, viral video

A house teetering on the edge of a crumbling cliff plunged into the sea in Argentina after its foundations were left weakened by rising sea levels. Footage captured in Mar Del Tuyu, Buenos Aires, shows the house collapse into the South Atlantic Ocean as the ferocious waves batter its foundations.

ITEMVIDEOS: గ్లోబల్ వార్మింగ్: సముద్రంలో కుప్పకూలిన రెండంతస్థుల భవనం

Posted: 07/31/2021 04:09 PM IST
Watch terrifying incident of two storey building collapsing into sea

గ్లోబల్ వార్మింగ్పై ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే వున్నారు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు. మంచుకొండలు కరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన వారు.. సముద్రంలో నీటి మట్టాలు కూడా పెరుగుతున్నాయని కూడా ప్రజలకు చెబుతూనే వస్తున్నారు. అయినా నా ఒక్కడితో పర్యావరణానికి ముప్పేం వాటిల్లిందన్న ధోరణితో ప్రజలు ఎవరికి వారు తిలోదకాలు చెబుతూనే వున్నారు. రాత్రి వేళ ఒక గంట పాటు విద్యుత్ దీపాలను అర్పి వేయడం.. ఇత్యాధి కార్యక్రమాలతో అసలు గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఎలా వుంటుందో కూడా అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

పర్యావరణంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్న మార్పులను శాస్త్రవేత్తలు చెబుతన్న ప్రకారం స‌ముద్రంలో నీటిమ‌ట్టం అంత‌కంత‌కూ పెర‌గ‌తుందన్నందుకు సాక్ష్యం.. ఈ వీడియో. సముద్ర తీరంలో కొన్నేళ్ల క్రితం నిర్మితమైన ఈ రెండంత‌స్తుల భ‌వ‌నం.. క్రమంగా పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలతో నీరు భవనం పునాదులకు చేరుకున్నాయి. సముద్రపు అలల ధాటికి పునాదులు బలహీనంగా మారాయి. ఇంకేముంది భవనం స‌ముద్రంలో కుప్ప‌కూలిన ఘ‌ట‌న బ్యునోస్ ఎయిర్స్‌లో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్న వీడియో ఇప్పుడు నెటిజ‌న్ల‌ను షాక్‌కు గురిచేస్తోంది.

అర్జెంటినాలో ఈ నెల (జులై) 28న బ్యునోస్ ఎయిర్స్‌లోని మ‌ర్ దెల్ తుయు ప్రాంతం నుంచి ఈ వీడియోను కెమెరాలో బంధించారు. స‌ముద్రంలో ఎగిసిప‌డిన అల‌లతో ఇంటి ఫౌండేష‌న్ దెబ్బ‌తిన్న కార‌ణంగా రెండంత‌స్తుల భ‌వ‌నం స‌ముద్రంలో కూలింద‌ని నిపుణులు చెబుతున్నారు. తీర ప్రాంతం కోత‌కు గుర‌వుతున్న క్ర‌మంలో ఇలాంటి పరిణామాలు త‌ర‌చూ చోటుచేసుకుంటున్నాయి. కాగా ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో య‌జ‌మానులు ఇంటిలో లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం వాటిల్ల‌లేదు. కాగా పర్యావరణ హితం కోసం మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలను నిలిపివేయకపోతే మరెన్ని వైపరిత్యాలు మానవాళి ఎదుర్కోవాల్సి వస్తుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles