SC may take up PIL against Pegasus snooping next week పెగసస్ వివాదం: వచ్చే వారం విచారించనున్న సుప్రీంకోర్టు

Chief justice says plea seeking pegasus probe may be heard next week

Israel, NSO Group, Pegasus spyware, Rahul Gandhi, Parliament, Pegasus, N.Ram, Sashi Kumar, Supreme Court, Pegasus raid, Pegasus, Pegasus news, Pegasus snooping row, Industrialist Anil Ambani, Pegasus issue, Amit Shah, PM Modi, National Politics

The request for a special investigation into the Pegasus scandal involving allegations that opposition politicians, journalists and others were targets of Israeli spyware, will be taken up next week, Chief Justice of India NV Ramana said today.

పెగసస్ వివాదం: జర్నిలిస్టుల పిటిషన్.. వచ్చేవారం విచారించనున్న సుప్రీంకోర్టు

Posted: 07/30/2021 12:50 PM IST
Chief justice says plea seeking pegasus probe may be heard next week

పెగాస‌స్ స్పైవేర్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ వ్య‌వ‌హారంలో మన దేశానికి చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులపైనా నిఘా కొనసాగిందన్న గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిని ఇజ్రాయిల్ లోని ఎన్ఎస్ఓ గ్రూపు సంస్థ రూపోందించిందని, ఇది ఈ స్పైవేర్ ను ప్రభుత్వాలకు విక్రయిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులే అంగీకరించారు. కాగా ఈ సంస్థపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు దాడులు చేసిన విషయం కూడా తెలిసిందే.

అయితే ఈ సంస్థ ఇచ్చిన స్పైవేర్ తో మన దేశంలో ఎవరిపై నిఘా పెట్టారన్న వివరాలపై భారత పార్లమెంటులో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు లోక్ సభలోనూ. ఇటు రాజ్యసభలోనూ పెగాసెస్ అంశాన్ని కేంద్రప్రభుత్వం చర్చించకపోవడంతో విపక్షాలు అందోళనలు చేపడుతున్నాయి. దీంతో తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న అరోపణలు విస్తృతంగా వినబడుతున్న క్రమంలో ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ ఇందులోని నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

పార్లమెంట్ ఉభయసభలను పెగాసెస్ అంశం కుదిపేస్తున్నాయి. ఈ వివాదాన్నే ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమై నిరసన తెలియజేస్తున్నాయి. ఈ పెగాసస్ తో నిఘా అంశంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ.. పలువురు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో కొన్ని రోజుల క్రితం ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. సీనియర్ లాయర్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణకు అంగీకారం తెలిపింది.

కొందరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పౌర సంఘాల నేతల ఫోన్లపై పెగాసస్ తో నిఘా పెట్టారన్న ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనిపై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈ నెల 27న సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేసిందా? లేదా? అన్న విషయాన్ని తెలియజేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అందులో పిటిషనర్లు కోరారు. సైన్యం వాడే స్పైవేర్ ను సామాన్య ప్రజల మీద ప్రయోగించడమంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఫోన్లపై నిఘా పెట్టడం వ్యక్తిగత జీవితంపై దాడి చేయడమేనని తెలిపారు. ఇది నేరపూరితమైన చర్య అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles