Israel government raids NSO offices పెగసస్ వివాదం: ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థలపై ఇజ్రాయిల్ దాడులు

Israeli government inspects nso group amid spyware claims

Israel, NSO Group, Pegasus spyware, Rahul Gandhi, Parliament, Israel raid NSO, Israel government raid on NSO, Project Pegasus, Israel NSO Pegasus raid, Pegasus, Pegasus news, Pegasus snooping row, Industrialist Anil Ambani, Pegasus issue, Amit Shah, PM Modi, National Politics

Israeli government authorities have raided the offices of NSO Group following revelations by a consortium of media organisations that the surveillance software vendor’s Pegasus spyware was used by multiple governments around the world to snoop on public figures and opposition leaders among others.

పెగసస్ వివాదం: ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థలపై ఇజ్రాయిల్ దాడులు

Posted: 07/29/2021 08:03 PM IST
Israeli government inspects nso group amid spyware claims

పెగాస‌స్ స్పైవేర్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ వ్య‌వ‌హారానికి రూపకర్తగా నిలిచింది మాత్రం ఎన్ఎస్ఓ గ్రూపు. ఇజ్రాయెల్ లోని ఈ సంస్థ రూపోందించిన ఈ స్పైవేర్ ఇప్పడు మన దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే మన దేశంతో ధైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని పడేలా చేసిన ఈ ఘటనతో ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థలు, కార్యాలయాలపై ఇజ్రాయెల్ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ విష‌యాన్ని ఆ గ్రూప్ గురువారం ధృవీక‌రించింది.

అయితే తాము మాత్రం పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌ని చేస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ప్ర‌తినిధులు మా కార్యాల‌యాల‌కు వ‌చ్చారు. వాళ్ల త‌నిఖీల‌ను మేము స్వాగ‌తిస్తున్నాం. ఇజ్రాయెల్ అధికారుల‌తో మా కంపెనీ పూర్తి పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది అని ఎన్ఎస్‌వో గ్రూప్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. త‌మ మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని ఈ తాజా త‌నిఖీలు బ‌య‌ట‌పెడ‌తాయ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని ఆ ప్ర‌తినిధి అన్నారు.

పెగాస‌స్ స్పైవేర్ నిఘా వివాదంపై విచార‌ణ జ‌ర‌ప‌డానికి మంగ‌ళ‌వారం ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ శాఖ అధికారుల బృందం ఎన్ఎస్‌వో గ్రూపు కార్యాల‌యాల్లో త‌నిఖీలు నిర్వ‌హించింది. ఈ గ్రూపు అభివృద్ధి చేసిన పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించి ప‌లువురు జ‌ర్న‌లిస్టులు, ప్ర‌భుత్వ అధికారులు, హ‌క్కుల కార్య‌క‌ర్తల ఫోన్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు 17 మీడియా మీడియా సంస్థల విచార‌ణ‌లో తేలింది. దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌డానికి ఇజ్రాయెల్ ప‌లు మంత్రిత్వశాఖ అధికారుల‌తో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ అంశాన్ని తాము చాలా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు ఇజ్రాయెల్ చెప్ప‌గా.. ఎన్ఎస్‌వో గ్రూపు మాత్రం త‌మ‌పై ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని చెబుతూ వ‌స్తోంది. తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను కేవ‌లం ప్ర‌భుత్వాల‌కే అమ్ముతామ‌ని, వాళ్లు ఎలా ఉప‌యోగిస్తార‌న్న‌ది వాళ్ల ఇష్ట‌మ‌ని కంపెనీ చెప్పింది. అంతేకానీ తమకు తాముగా ఈ సాప్ట్ వేర్ ను ఎవరిపైనా ఉపయోగించలేదని చెప్పింది. అయినా ఇజ్రాయిల్ దేశ అధికారులు మాత్రం దాడులు కొనసాగించి కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Israel  NSO Group  Pegasus spyware  Rahul Gandhi  Parliament  Pegasus  Amit Shah  PM Modi  National Politics  

Other Articles