Govt announces reservation quota in medical courses వైద్య కోర్సుల్లో ఓబిసి, ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం

Government to offer 27 reservation for obc 10 for ews in mbbs

neet ug pg admissions 2021, neet ug admissions, neet pg admissions, ews quota in neet admissions, obc quota in neet admissions, reservations in neet, PM Modi, NEP 2020, national education policy, education, higher education, school education, policy, medical, reservation, MBBS reservation, MBBS seat

The Prime Minister Narendra Modi-led government has taken a decision to provide 27 percent reservation for Other Backward Classes (OBCs) and 10 percent reservation for Economically Weaker Section (EWS) in the All India Quota (AIQ) scheme for undergraduate and postgraduate medical / dental courses (MBBS / MD / MS / Diploma / BDS / MDS) from the current academic year 2021-22 onwards.

వైద్య కోర్సుల్లో ఓబిసి, ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు.. కేంద్రం కీలక నిర్ణయం

Posted: 07/29/2021 06:51 PM IST
Government to offer 27 reservation for obc 10 for ews in mbbs

వైద్య విద్య కోర్సులను అన్ని వర్గాలకు చేరువ చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. యూజీ, పీజీ, డెంటల్, మెడికల్ కోర్సులకు రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి జులై 26న ప్రధాని మోడీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఓబీసీలు, వెనకబడిన వర్గాలకు వైద్య విద్యలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని ఆదేశించడంతో ఈరోజు ఉత్తర్వులను వెలువరించారు. ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ప్రతి ఏటా 5550 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగబోతుంది. సామాజిక న్యాయంలో ముఖ్యంగా కొత్త అధ్యాయంగా దీన్ని ప్రధాని మోడీ అభివర్ణించారు.

ఎంబీబీఎస్ లో ప్రతి ఏడాది 1500 మంది విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 550 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, పీజీలో 1000 మంది మందికి ఈ రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సుప్రీంకోర్టు 1986లోనే ఆల్ ఇండియా కోటాను ప్రవేశపెట్టింది. ఆల్ ఇండియా కోటాలో భాగంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకునే వారికి ఈ రిజర్వేషన్లు ఎంతగానో దోహదం పడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles