TDP leader Devineni Uma Maheswara Rao arrested దేవినేని ఉమ అరెస్టు.. అట్రాసిటీ.. హత్యాయత్నం కేసులు

Tension erupts in mylavaram amid tdp leader devineni umas arrest

Vijayawada, TDP, Devineni Uma's arrest, Devineni Uma, Vasantha Krishna Prasad, YSRCP MLA Mylavaram, Gaddamanuguru, illegal mining, Convey attacked, Krishna district, Andhra Pradesh, crime

In the latest development, tensions have risen after police arrested former minister and TDP leader Devineni Umamaheswara Rao, who was been attacked by the YSRCP activists at kondapalli of G.Konduru.

దేవినేని ఉమ అరెస్టు.. అట్రాసిటీ.. హత్యాయత్నం కేసులు

Posted: 07/28/2021 11:04 AM IST
Tension erupts in mylavaram amid tdp leader devineni umas arrest

తనపై అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినా.. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పోలిస్ స్టేషన్ ఎదుట తన కారులో ధర్నాకు దిగిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావును అర్థరాత్రి వేళ పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అప్పటికే అధికార పార్టీ నేతల రాళ్ల దాడిలో ధ్వంసమైన తన కారు అద్దాలను.. పూర్తిగా తొలగించిన పోలీసులు బలవంతంగా దేవినేనిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ లోకి తరలించడం చర్చనీయాంశంగా మారింది.

మైలవరం నియోజకవర్గంలోని జి.కోండూరు మండలం పరిధిలోని కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న అరోపణలపై దేవినేని ఉమామహేశ్వర్ రావు క్రితం రోజున సదరు ప్రాంతాన్ని పరిశీలించారు. కొంతమంది టీడీపీ నేతలతో పాటు వెళ్లిన ఆయన అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ కు తెరలేపారని అరోపించారు. దీంతో ఇక కొండపల్లి ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న ఆయన వాహనాన్ని జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద కొందరు అడ్డుకుని చుట్టుముట్టి దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయన వాహనం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.

తనపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని అరోపించారు. మాజీమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించిన తాను.. అక్రమ మైనింగ్ అరోపణలు రావడంతో ఆయా ప్రాంతానికి పరిశీలనకు వెళ్లిన తనకు పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారని ఆయన అరోపిస్తూ జి.కొండూరు పోలిస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కాగా ధర్నా చేస్తున్న దేవినేనిని పోలీసులు అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన పోలిస్ స్టేషన్ ఎదుట అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కోన్నారు.

దేవినేని ఉమ మహేశ్వర్ రావు పిర్యాదు విషయంలో నూటికి నూరుశాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. ఉమ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కాగా దేవినేని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు హత్యహత్నం కింద 307 సెక్షన్ పై కేసులు నమోదు చేశారు. టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. తన కారుపై కొందరు అగంతకులు దాడికి పాల్పడ్డారని పిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తినే పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా వుందన్నారు, తమకు అన్యాయం జరిగిందన్న గోంతునే నొక్కేసి.. అరాచక పాలన రాష్ట్రంలో సాగుతుందని అనడానికి ఇది నిదర్శనమని టీడీపీ వర్గాలు విమర్శించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles