Three Names Revealed in YS Viveka case! మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకేసులో ఆ ముగ్గురే కీలకం..

Cbi investigation at crucial stage in ys vivekananda reddy murder case

CBI, murder case, Vivekananda, Rangaiah, servent, 45 days investigation, 1600 persons interogation, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

Watchman Rangaiah, who testified before Jammalamadugu Magistrate in YS Vivekananda Reddy’s murder case, made some interesting comments before the media. He revealed saying the names of three who had come to the residence of Viveka on the day of the murder.

కీలక దశకు చేరిన మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకేసు విచారణ..

Posted: 07/24/2021 01:46 PM IST
Cbi investigation at crucial stage in ys vivekananda reddy murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తులో ఆయన ఇంటి వాచ్ మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. గత కొన్నాళ్లుగా హత్యపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. వైఎస్‌ వివేకాది హత్య అంటూ జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం రికార్డు చేశారు. రెండున్నర గంటలపాటు కోర్టులో వాచ్ మెన్‌ రంగయ్యను విచారించిన సీబీఐ అధికారులు.. అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

వివేక హత్య కేసులో తొమ్మిది మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు రంగయ్య చెప్పినట్లు తెలుస్తోంది. సెక్షన్ 164 కింద రంగయ్య వాంగ్మూలం రికార్డు చేశారు. 45 రోజుల నుంచి వివేకా హత్యకేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మూడు రోజుల నుంచి వాచ్ మెన్ రంగయ్య విచారణకు హాజరవుతున్నాడు. నిన్న రంగయ్యను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రంగయ్య కీలక విషయాలు వెల్లడించాడు. రంగయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 164 కింద రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం రికార్డయ్యింది. ఈ సెక్షన్ ప్రకారం రికార్డు చేసిన వాంగ్మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునే అవకాశం వుండదు.

వాచ్ మన్‌ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, కిరణ్ సోదరుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ముఖ్యంగా వివేకాను హత్య ముగ్గురే అని వాచ్‌మెన్ రంగయ్య చెబుతున్నారు.

కోర్టులో వాంగ్మూలం తర్వాత ముగ్గురి పేర్లు చెప్పారు ప్రత్యక్షసాక్షి వాచ్ మెన్ రంగయ్య. ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరిలే వివేకాను చంపినట్లుగా చెప్పారు రంగయ్య. అయితే మరో వ్యక్తి కూడా వున్నాడని కానీ అతడ్ని అదే తొలిసారి చూడటం అని చెప్పినట్లు సమాచారం. ఆ వ్యక్తి చాలా పోడుగ్గా వున్నాడని చెప్పాడు. ఇక మరోవైపు తన పేరు చెబితే చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి బెదిరించినాడని, అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదని చెప్పాడు రంగయ్య. అయితే, సీబీఐ అధికారులు తనకు భరోసా ఇవ్వడంతోనే వివరాలు చెప్పినట్లు రంగయ్య చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles