జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ వైపు తన చిత్రాల షూటింగ్ తో బిజీగా వుంటూనే.. ఇటు రాజకీయాలకు కూడా తన సమాయాన్ని కేటాయిస్తూ బిజీగా వున్నారు. ఇటీవల మంగళగిరిలో పర్యటనించిన పవన్ కల్యాణ్.. అమరావతి ప్రాంత రైతులను కలిసిన విషయం తెలిసిందే, ఇక ఆ వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతతోనూ సమావేశం అయ్యారు. ఈ క్రమంలో రైతుల సమస్యలతో పాటు నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల కోసం కేంద్రంలోని పెద్దలను కలసి అమరావతిని రాజధానిగా కోనసాగించాలని కోరిన విషయం తెలిసిందే.
తాజాగా నిరుద్యోగ యువత కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్దం కావాలని యోచనలో వున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్ చెప్పారు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ చెప్పారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్ అన్నారు.
ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత 10వేల ఉద్యోగాలు ప్రకటించడం యువతను వంచించడం కాకమరేటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని నిరుద్యోగ యువత ఎంతో ఆవేదన చెందుతొందని అన్నారు. గ్రూప్-1, 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని అర్థమవుతుందన్నారు. కొద్ది నెలల కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్-1, 2ల్లో సుమారు 1000 ఖాళీలను గుర్తించారన్నారు. జాబ్ క్యాలెండర్లో 36 మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని, పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ విధంగా నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని పవన్ వాపోయారు. టీచర్ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని, సీఎం చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయిందని నిలదీశారు. పోలీసు శాఖలో 7 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని పవన్ వాపోయారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణ కూడా సాగటం లేదని పవన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more