Three Maoists Killed In Encounter In Chhattisgarh చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోల హతం..

Three naxals gunned down in encounter in chhattisgarh s dantewada

Maoists, Encounter, maoists killed in encounter, Three naxals killed, Dholkal hills forest area, Bhairamgarh area maoists, Maoists, Encounter, Three Naxals killed, Dholkal Hills Forest, DRG Jawans, Faraspal Police Station, Abhishek Pallav, SP, Rewarded naxals killed, Chhattishgarh, Crime

Naxalites once again faced a major setback in Chhattisgarh’s Dantewada district when, during a fierce encounter with the security forces, three were killed and several weapons recovered from the site. The encounter took place in the evening the Dholkal hill forest area of Faraspal police station between naxalites who were active in Bhairamgarh area committee and the DRG jawans.

చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోల హతం..

Posted: 07/16/2021 11:09 AM IST
Three naxals gunned down in encounter in chhattisgarh s dantewada

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరోమారు ఎదురుదుబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా నిన్న రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లోనూ ముగ్గురు మావోయిస్టులను పోలీసు బలగాలు హతమార్చాయి. గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఎన్ కౌంటర్.. అయితే ఈ ఎన్ కౌంటర్లో హతులైన ముగ్గురు మావోయిస్టులపై లక్ష రూపాయల రివార్డులను ప్రకటించబడి వున్నాయి. హతులైన మావోయిస్టుల నుంచి ఆయుధాలను పోలీసుల బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఛత్తీస్ గడ్ లోని దంతేవాడ జిల్లాలోని జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలావున్నాయి, దంతెవాడ జిల్లాలోని దోల్కాల్ హిల్స్ అటవీ ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుకున్న డీఆర్జీ పోలీస బలగాలు ఫరాస్ పాల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిలు ఎధురుపడి.. కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిని మిలటరీ ప్లాటూన్ కమాండర్ బిర్జు కాకెమ్ (35), ఆర్‌పీసీ ఉపాధ్యక్షుడు జగ్గూ కాకెమ్ (30), మిలీషియా ప్లాటూన్ సభ్యుడు అజయ్ ఒయామీ (26)గా గుర్తించారు.

మృతుల్లో బైరాంగఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు హతమయ్యారని, వీరి ముగ్గురిపై లక్ష రూపాయల మేర రివార్డు కూడా ప్రకటించబడి వుందని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపాడు. అయితే ఎదురుకాల్పుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని వారి కోసం అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక మరణించిన ముగ్గురు మావోల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు, మూడు స్వదేశీ తుపాకులు, 3 కిలోల ఐఈడీ బాంబులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న వాటిలో వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles