Excited Dog Knocks Down Owner While Playing 'Fetch' మితిమీరిన ప్రేమ కూడా శాపమేనా.?

Excited dog knocks down owner while playing fetch then returns for round 2

Watch video, Dog trips man, Animal Videos, dog, Declan, Kennebunkport, Maine, USA, Pets latest news, funny video, pets funny video, viral video, video viral

one man who was looking to bond with a pet dog over a game of fetch was in for an unpleasant experience. In a video shared by ViralHog, the man, named Declan, from Maine, USA can be seen stepping outside his car and throwing a twig for the dog to collect. The excited canine rushes straight towards the twig - but runs into the man instead.

ITEMVIDEOS: మితిమీరిన ప్రేమ కూడా శాపమేనా.? వీడియో చూసి చెప్పండీ..

Posted: 07/15/2021 08:58 PM IST
Excited dog knocks down owner while playing fetch then returns for round 2

జంతు ప్రేమికులకు తమ చుట్టూ పెంపుడు జంతువులు తిరుగుతుంటే వారిలో అదో రకమైన కొత్త శక్తి పునికి పుచ్చుకుంటుంది. అవి ఎంతో ప్రేమగా తమను చూసి తోకను అడిస్తూ రావడంతో వాటికి ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో యజమానులు కూడా వాటితో సరదాగా అడుతుంటారు. ఈ కోవలో ముందువరుసలో వుండేవి మాత్రం విశ్వాసమున్న శునకాలే అంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడూ ఫన్ క్రియేట్ చేయడం కోసం ఎదురుచూస్తూనే ఉంటాయి. కాకపోతే రీసెంట్ గా తన పెంపుడు కుక్క కారణంగా ఓ వ్యక్తి దారుణమైన ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాడు.

అమెరికాలోని మైనెలో ఉండే డెక్లాన్ కు జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారులో నుంచి బయటకు దిగుతూ తన కుక్క పట్టుకోవడానికి కట్టె విసిరాడు. దాని కోసం పరిగెత్తిన కుక్క డోర్ తెరిచి దిగిన ఆ వ్యక్తి కాలికి తగులుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అతని కాళ్లలో అడ్డంపడటంతో వెంటనే కిందపడిపోయాడు. అనూహ్యమైన రియాక్షన్ తో తలకు గట్టి దెబ్బతగిలాక లేచి నిలబడ్డానికి తంటాలు పడ్డాడు. లేచాక హమ్మయ్య అని చూస్తుండగా కట్టెముక్కను తీసుకొచ్చి మళ్లీ విసరమంటూ నిల్చొంది ఆ కుక్క.

వీడియో పోస్టు చేసిన వ్యక్తి కొద్దిపాటి గాయాలతోనే కారు దిగిన వ్యక్తి బయటపడ్డాడని ఎటువంటి ప్రమాదం లేదని చెప్పాడు. కాగా, యజమాని కంటే శునకానికే ఎక్కువ దెబ్బ తగిలిందని, అయినా అది వెంటనే లేచి యజమానికి తాను విసిరిన కర్రను తెచ్చి ఇచ్చి.. మరో రౌండ్ కు సిద్దంగా నిలబడిందని.. వాటి విశ్వసనీయతకు ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదని ఓ నెటిజన్ అన్నారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు కుక్కను హ్యాండిల్ చేయడం రావాలంటూ సూచనలిస్తూనే, ఆ కుక్కను తిట్టిపోస్తున్నారు. మరొకరేమో తనకు కూడా కుక్కలతో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ అయిందని, క్రికెట్, టెన్నిస్ ఆడిస్తే బంతి ఎక్కడ పడినా తీసుకొచ్చి ఇస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dog trips man  Animal Videos  dog  Declan  Kennebunkport  Maine  USA  funny video  viral video  

Other Articles