జమ్మూకశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దులో అత్యంత తక్కువ ఎత్తులో డ్రోన్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో అది వెనుదిరిగింది. గత రాత్రి జమ్ముకాశ్మీర్ లోని ఆర్నియా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారత భూభాగంలోకి దాదాపు 150 మీటర్లమేర చొచ్చుకుని వచ్చింది. ఆ ప్రాంతంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరపడంతో అది కొద్దిసేపటికే వెనుదిరిగింది. భారత సరిహద్దుల్లోని పరిస్థితులను గుర్తించేందుకు లేదా ఆయుధాలు, మందు గుండు సామగ్రిని జార విడిచేందుకు పాక్ ఆ డ్రోనును పంపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
భారత భూభాగంలో సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో అది సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆ డ్రోను తిరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గత పక్షం రోజుల వ్యవధిలో ఇటువంటి డ్రోన్లు కనపడడం ఇది ఆరో సారి. అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత ప్రాదేశిక భూభాగంలోకి డ్రోన్లను పంపేందుకు పదే పదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తుండడంతో భారత సైన్యం రక్షణ చర్యలు తీసుకుంటోంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ లోని విమానాశ్రయంలోని ఐఏఎఫ్ స్థావరంపై గత కొన్ని రోజుల క్రితం డ్రోన్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా పలు ప్రాంతాల్లో డ్రోన్లు సంచరిస్తూ కనపడడంతో వాటిపై భారత భద్రతా బలగాలు కాల్పులు జరిపి తరిమేసాయి. ఆ తరువాత కూడా పలు డ్రోన్లు అత్యంత ఎత్తులో భారత భూభాగంలోకి చోచ్చకుని వచ్చి జమ్మూకాశ్మీర్ లోని ఎయిర్ బేస్ ల వద్ద సంచరించాయి. అయితే డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందు గుండు సామగ్రి, డ్రగ్స్ వంటివి జారవిడిచే అవకాశాలు ఉండడంతో అవి సంచరించిన ప్రాంతాల్లో జవాన్లు వెంటనే గాలింపు చర్యలు చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more