మాజీ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని ఈ సారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని గట్టి సంకల్పంతో వున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఈటెలపై తనదైన శైలిలో విమర్శనలను, అరోపణలను సంధిస్తూనే వున్నారు. ఈటెలపై గెలుపును అస్వాదించడానికి అయన తాను ఇన్నాళ్లు కోనసాగిన పార్టీకి కూడా రాజీనామా చేశారు. తాను ఒక్కసారి శాసనసభకు ఎన్నిక కావాలన్న తపనతో హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మద్దతును కోరుతున్నారు. ఇందులో తప్పు ఏం లేకపోయినా ఆయన ఫోన్ కాల్ ఆడియో మాత్రం లీక్ అవుతూ వైరల్ అవుతోంది.
తన ఆత్మగౌరవానికి భంగం కలిగించిన పార్టీలో తాను కోనసాగలేనని అందుచేత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరిన ఈటెల మరోమారు తనను బలపర్చాలని కోరుతూ హుజూరాబాద్ ప్రజలను కోరుతూ ఇప్పటికే జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈటెల చేతిలో పరాభవం చవిచూసిన కౌశిక్ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో విజయ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. తనకు టీఆరఎస్ పార్టీ టికెట్ కన్పాఫ్ అయ్యిందని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ప్రచారం చేసకున్న ఆయన అడియో లీక్ కావడంతో వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. అయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా.. అందులో తన తప్పేం లేదని అంటూనే టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈటెల బలమైన నాయకుడని రేవంత్ అనడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఈటెల గెలుపు తధ్యమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీపై ఎన్నికల సంగ్రామంలో పోరాడాల్సిదిపోయి.. అవతలి అభ్యర్థి బలవంతుడని ప్రశంసించడమేమిటని ప్రశ్నించారు. తాను ఎన్ని సార్లు కమిటీ వేయాలని కోరినా స్పందించక పోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అన్నారు. దీంతో తనకు రానున్న ఎన్నికలలో మద్దతు ప్రకటించాలని ఆయన తిరుపతి అనే కాంగ్రెస్ నేతకు చేసిన ఫోన్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more