Drinking coffee may reduce risk of catching COVID-19 కప్పు కాఫీతో కరోనాకు చెక్ పెట్టోచ్చా.? అధ్యయనం వివరాలివే..

Does drinking coffee reduce the risk of contracting covid here s what research shows

COVID-19, COVID-19 study, Coronavirus Study, coronavirus, coffee, coffee benefits, coronavirus home remedies COVID-19, COVID-19 Study, Coronavirus Study, Coronavirus, Coffee, coffee benefits, Health, Pneumonia, Northwestern University, America

As per a study conducted by researchers at Northwestern University, drinking a cup of coffee per day may reduce the chances of contracting COVID-19. It says one or more cups of coffee per day can reduce the risk of catching COVID-19 by as much as 10 percent.

కప్పు కాఫీతో కరోనాకు చెక్ పెట్టోచ్చా.? అధ్యయనం వివరాలివే..

Posted: 07/13/2021 03:43 PM IST
Does drinking coffee reduce the risk of contracting covid here s what research shows

శీర్షిక చూసి ఔనా.. నిజమేనా అంటున్నారు కాదూ.. కానీ ఇది నిజమని అమెరికాలోని నార్త్ వెస్టరన్ యూనివర్సిటీ చెబుతోంది. కాఫీతో కరోనాకు చెక్ పెట్టవచ్చునని అంటోంది. ఈ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లకు కరోనా ప్రభావం చూపే అవకాశఆలు దాదాపు పది శాతం తక్కువని అద్యయనం వివరాలు స్పష్టం చేస్తున్నాయి, అమెరికాలోని నార్త్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చర్లు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై లోతుగా అధ్యయనం చేశారు. అందులో కాఫీతో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తేల్చారు.

అలాగే.. అధిక స్థాయిలో కూరగాయలు తినేవారు, తక్కువగా మాంసం తినేవారు కూడా కొవిడ్ ఇన్ఫెక్షన్ తక్కువ ముప్పు ఉందని గుర్తించారు. సాధారణంగా కాఫీలో యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయని తెలుసు.. అలాగే యాంటీ ఇన్ ఫ్లేమ్మెంటరీ ప్రాపర్టీస్ (anti-inflammatory) గుణాలు కూడా ఉంటాయి. కాపీ తాగే అలవాటు ఉన్నవారిలో CRP, interleukin-6 (IL-6), tumour necrosis factor I (TNF-I) వంటి ఇన్ఫ్లమేటరీ బయోమార్కర్లతో అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఇవి కొవిడ్ -19 తీవ్రత మరణాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

కాఫీ తాగడం వల్ల వృద్ధులలో న్యుమోనియా ముప్పు తక్కువగా ఉంటుంది. కోవిడ్ -19 కి కాఫీ ఇమ్యునోప్రొటెక్టివ్ (immunoprotective) ప్రభావం అధికంగా ఉంటుందని తేలింది. అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం యూకేలోని బయోబ్యాంక్‌లో 40వేల మంది రికార్డులను విశ్లేషించింది. రోజువారీ కాఫీ, టీ, నూనె చేపలు, మాంసం, ఎర్ర మాంసం, పండ్లు, కూరగాయలు ఇచ్చి పరిశీలించారు. వీరిలో కోవిడ్ -19 వ్యాప్తి ముప్పు తక్కువగా ఉందని కనుగొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Caffeine  coffee  coronavirus  COVID-19  Health  Pneumonia  Northwestern University  America  

Other Articles