Congress issues show cause notice to Kaushik Reddy కౌశిక్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్.. షోకాజ్ నోటీసులు జారీ.!

Telangana congress issues show cause notice to kaushik reddy

TPCC secretary Padi Kaushik Reddy, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, Telangana, Politics

TPCC Disciplinary Committee Chairman Kodanda Reddy has issued show cause notice to Huzarabad constituency leader P. Kaushik Reddy for indulging in alleged anti-party activities. The Committee directed Kaushik Reddy to respond to the notice within 24 hours, failing which stern action would be initiated.

కౌశిక్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్.. షోకాజ్ నోటీసులు జారీ.!

Posted: 07/12/2021 02:17 PM IST
Telangana congress issues show cause notice to kaushik reddy

హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపిసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. గత కొద్దికాలంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోదండరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. 'టీఆర్ఎస్ టికెట్ తనకే...' అంటూ కౌశిక్ రెడ్డి ఆడియో లీకవడంతో కాంగ్రెస్ ఈ చర్యలకు పూనుకుంది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని... లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ తన మంత్రి పదవితో పాటు శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గనున్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న ఉపఎన్నికలలో తనకే టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయినట్లు ఆయన విజేందర్ అనే మాదన్నపేటకు చెందిన పార్టీ తృతీయశ్రేణి నాయకుడితో మాట్లాడిన ఫోన్ సంబాషణ అంతా బహిర్గతం కావడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. గంటల వ్యవధిలోనే కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసాయి.

గత కొంతకాలంగా రాష్ట్రంలోని అధికార పార్టీతో సన్నితంగా మెలుగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలతోనూ సన్నిహత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్న కౌశిక్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించినట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. శరవేగంగా స్పందించి చర్యలకు ఉపక్రమించడంతో రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి చర్యలు లేకపోవడంతోనే పార్టీలో నాయకులు ఇష్టానుసారంగా పార్టీలు బదలాయించి వెళ్లిడం జరిగిందని, ఈ చర్యలకు పార్టీలోని ఇతర నాయకులకు కూడా ఓ సంకేతం ఇచ్చినట్టు అయ్యిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైన పాడి కౌశిక్ రెడ్డిపైనే గంటల వ్యవధిలో చర్యలు తీసుకోవడంతో.. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడే ఎంతటి నాయకులకైనా చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతమాత్రం సహించబోమని, వెనువెంటనే చర్యలు తీసుకుంటామన్న సంకేతాలు క్యాడర్ లోకి బలంగా పంపించేందుకు ఈ చర్యలు తీసుకున్నారా.? అన్న సందేహాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TPCC secretary  KoushikReddy  Phone Call viral  Congress  Audio viral  Etela Rajender  Telangana  Politics  

Other Articles