Kurnool: Woman farmer finds rare diamond in farm మహిళా రైతును వరించిన అదృష్టం.. వజ్రం లభ్యం

Woman farmer finds rare diamond in farm turns lakhier over night

Diamond in Agriculture land, Agriculture woman labourer turns lakhpati, woman labourer diamond, land tilling diamond woman laborer, Diamond, Farmer, Agriculture land, Jonnagiri woman, agriculture labour, Lakpati, Thuggali woman labour, Kurnool, Andhra Pradesh

A woman farmer belongs to Jonnagiri village in Thuggali mandal has found a diamond while working at a farm. As per the reports, the woman sold the diamond to a local merchant for Rs 30 lakh. It is said that the diamond worth crores of rupees in the open market.

మహిళా రైతును వరించిన అదృష్టం.. లభించిన వజ్రం

Posted: 07/12/2021 12:39 PM IST
Woman farmer finds rare diamond in farm turns lakhier over night

అదృష్టం అంటూ ఉండాలే కానీ.. అది భూమి పోరల్లో దాగివున్నా.. తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పక దరిచేరుతుందని పెద్దలు చెప్పే మాట అక్షరసత్యం అని మరోమారు నిరూపితం అయ్యింది. పొలంలో పనులు చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు అరుదైన వజ్రం లభించింది. అరుదైనది కావడంతో దాని ధర కూడా అంతే పలికింది. రాత్రికి రాత్రే మహిళను లక్షాధికారిని చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగరి గ్రామానికి చెందిన మహిళ కష్టాలను ఒక్కదెబ్బతో హరించేట్టు చేసింది.

ఔనా నిజంగానా.. అంటే అంతేనని చెప్పాలి. మామాలుగా రాత్రికిరాత్రి ఓ వ్యవసాయ పనుల కోసం వెళ్లిన మహిళ కుటుంబం లక్షాధికారి కుటుంబంగా మారిపోయింది. పొలం పనులు చేసేందుకు ఉదయాన్నే బయలుదేరిన ఆ మహిళకు అదృష్టం వరించింది. అమె కష్టాలు ఒక్క ఉదుటున తీరిపోయాయి. ఉదయం కూలిపనులకు వెళ్లిన ఆమె రాత్రికి లక్షాధికారిగా మారిపోయింది. అమె ముఖంతో సంతోషం.. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసాయి. ఇంతకీ జరిగిందేమిటంలే అమెకు అరుదైన వజ్రం లభించింది. పొలం పనులు చేస్తుండగా ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అంతే దానిని తీసుకుని పరిశీలించగా అది వజ్రం అని తెలిసింది.

వర్షం చినుకులు పడితే చాలు భూమి పోరల్లోంచి వజ్రాలు నేలను చీల్చుకుంటూ బయటపడుతుంటాయన్నది తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ తరహాలో స్థానికులకు వజ్రాలు లభిస్తుంటాయి. దీంతో ఈ జిల్లావాసులతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వేటను కోనసాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పోలాలపై అనేకానేలు వాలిపోతుంటారు. కాగా తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ పొలంలో కూలి పనులకు వెళ్లింది.

అక్కడ పనులు చేస్తుండగా అరుదైన వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రం ధర కోట్లలో వున్నా.. దానిని స్థానిక వ్యాపారులు మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేశారని సమాచారం. ఈ వజ్రాన్ని సదరు మహిళ నుంచి రూ.30 లక్షలకు కొనుగోలు చేశారని తెలిసింది. స్థానిక వజ్రం వర్తకులు పలువురు వచ్చి పోటీపడినా మహిళ మాత్రం తనకు రూ.30 లక్షలు ఇస్తానన్న వ్యాపారికే తన వజ్రాన్ని అందించింది. కాగా దానిని నగరంలోని బడా వ్యాపారులకు కోట్లలో విక్రయించి వ్యాపారి లభం పోందుతాడని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles