Dr Reddy's Labs, Serum Institute gets shock from DGCI సీరమ్, డాక్డర్ రెడ్డీస్ లకు కేంద్రం షాక్..

Dr reddy s labs serum institute denied approval for clinical trials of sputnik light moderna

Corona Vaccine, Covid Vaccine, Serum Institute, Dr. Reddys Laboratories, Sputnik V, Sputnik Light, Covid-19, Coronavirus, Russia, Moderna, DGCI, Clinical Trails, DGCI Experts panel

The expert committee has denied permission to Dr. Reddy's Laboratories and Serum Institute for conducting Clinical trials of the Russian Covid-19 vaccine Sputnik Light in India.

సీరమ్, డాక్డర్ రెడ్డీస్ లకు కేంద్రం షాక్.. ట్రయల్స్ కు అనుమతి లేదు

Posted: 07/01/2021 05:44 PM IST
Dr reddy s labs serum institute denied approval for clinical trials of sputnik light moderna

సీరం ఇన్ స్టిట్యూల్ సహ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయా సంస్థల ఆద్వర్యంలో తయారవుతున్న కరోనా టీకాల ట్రయల్స్ ను నిలిపివేయాలని అదేశాలను జారీ చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవోవాక్స్‌ కొవిడ్‌ టీకా 2-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫేజ్‌-2, 3 ట్రయల్స్‌ నిర్వహించొద్దని సెంట్రల్‌ డ్రగ్‌ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, పెద్దలపై మొదట ట్రయల్స్‌ పూర్తి చేయాలని ప్యానెల్‌ సీరం సంస్థకు సూచించింది. సీరం దేశవ్యాప్తంగా పది కేంద్రాల్లో 2-11, 12-17 సంవత్సరాల మధ్య 920 మంది పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది.

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ) కూడా ఏ దేశంలోనూ వ్యాక్సిన్‌ను ఆమోదించలేదని పేర్కొంది. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ ఇంక్‌ సంస్థ ఎన్‌వీఎక్స్‌ కోవ్‌ 2373 పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరం కంపెనీ ఒప్పందం చేసుకుంది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ ఎన్‌వీఎక్స్‌-2373 టీకా మితమైన, తీవ్రమైన కేసుల్లో వందశాతం ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. మొత్తంగా 90.4 శాతం సమర్థతతను చూపిందని జూన్‌ 14న నోవావాక్స్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక మరోవైపు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కూడా కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) నిపుణులు స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ కు అనుమతులపై నిన్న సాయంత్రం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పై మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని, కాబట్టి రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.

“రెడ్డీస్ ట్రయల్స్ చేయాలనుకుంటున్న స్పుత్నిక్ లైట్.. స్పుత్నిక్ వీలో మొదటి డోసే. అంతకుముందు స్పుత్నిక్ వీకి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ ప్రభావం గురించి ముందే తెలిసింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ డేటా చూస్తే అది అంత ప్రభావవంతం కాదని తేలింది. కాబట్టి స్పుత్నిక్ లైట్ పై మరోసారి ట్రయల్స్ చేసేందుకు ఎలాంటి హేతుబద్ధత కనిపించట్లేదు’’ అని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, మేలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

తొలుత లక్షన్నర డోసులను రష్యా పంపించగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు 30 లక్షలకుపైగా డోసులను పంపించింది. రీకాంబినెంట్ డీఎన్ఏ సాంకేతికతతో అడినోవైరస్ వెక్టార్లుగా స్పుత్నిక్ వీని అభివృద్ధి చేశారు. రీకాంబినెంట్ అడినోవైరస్ 26 (ఆర్ఏడీ 26), రీకాంబినెంట్ అడినోవైరస్ 5 (ఆర్ఏడీ 5) అనే రెండు డోసులుగా టీకాను ఇస్తారు. ఇందులో ఆర్ఏడీ 26 మొదటి డోసు కాగా.. ఆర్ఏడీ 5 రెండో డోసు. తర్వాత ఆర్ఏడీ26నే స్పుత్నిక్ లైట్ గా రష్యా ప్రభుత్వం మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles