8 EU nations approve Covishield vaccine భారత్ హెచ్చరికలకు దిగివచ్చిన ఈయూ దేశాలు.!

Covishield eu row 8 european nations switzerland clear covishield vaccine

India warning to European Union, India warning to EU countries, Indian vaccination, covaxin, covishield, India, Indian vaccines, pfizer, moderna, astrazenica, johnson, european vaccines, Quarantine, India warns EU, Coronavirus, Coronavirus vaccine, Covid-19, European Union, Bharat Biotech,Serum Institute of India, Mandatory quarantine, WHO, India Covid vaccine, Covid vaccine details, Covid-19 vaccine, covid19, corona

After India formally requested European Union nations to include SII’s Covishield and Bharat Biotech’s Covaxin in their exemption list for the passport, 8 nations have given go-ahead to the Oxford-AstraZeneca vaccine (Covishield). Austria, Germany, Slovenia, Greece, Iceland, Ireland and Spain are the seven EU member countries that accepted COVISHIELD vaccine.

భారత్ హెచ్చరికలకు దిగివచ్చిన ఈయూ దేశాలు.! కోవిషీల్డ్ టీకాకు అమోదం.!!

Posted: 07/01/2021 04:41 PM IST
Covishield eu row 8 european nations switzerland clear covishield vaccine

గ్రీన్‌ పాస్‌ పోర్ట్‌ స్కీమ్‌ కింద ఈయూ దేశాల ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ, ఇండియాలో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం సుత్తిమెత్తాగా హెచ్చరికలు జారీ చేయడంతో యూరోపిన్ యూనియన్ దిగివచ్చింది. భారతీయులను కూడా యూరప్‌ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరుతూనే.. అలా కానీ పక్షంలో ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని, వారిని కూడా తప్పనసరి క్యారంటైన్ కు తరలిస్తామని తేల్చిచెప్పింది. దీంతో భారత్ తో పెట్టుకోవడం ఇష్టం లేని ఈయూ దేశాలు ఓ మెట్టు దిగివచ్చాయి.

అయితే భారత్ హెచ్చరికల నేపథ్యంలో కోవాగ్జిన్ టీకాను గుర్తించని ఈయూ దేశాలు కోవిషీల్డ్ వాక్సీన్ తీసుకున్న వారికి మాత్రం పర్యటించేందుకు అనుమతించాయి. ఏడు యురోపియ‌న్ యూనియ‌న్ దేశాలు. ఆస్ట్రియా, జ‌ర్మ‌నీ, స్లొవేనియా, గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్ దేశాలు సీర‌మ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కొవిషీల్డ్ కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాయి. అటు స్విట్జ‌ర్లాండ్ కూడా కొవిషీల్డ్ వేసుకున్న ప్ర‌యాణికుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. ఇండియాలో సీరమ్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ యూరోపియన్ దేశాల్లో ఇస్తున్న అస్ట్రాజెనికా వాక్సీన్ ఒక్కటే కావడంతో ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిసింది.

ఇక ఫైజర్-బయోఎన్ టెక్ సారధ్యంలో రూపోందిన కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కోవాగ్జిన్ మాత్రం ఈయూ ఇప్పటికీ గుర్తించలేదు. యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఫైజ‌ర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్స్‌జెర్‌వ్రియా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు చెందిన జాన్సెన్ వ్యాక్సిన్‌ల‌కు మాత్రమే అనుమ‌తి ఇచ్చింది. అంటే ఈ నాలుగు ర‌కాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ల‌కు మాత్ర‌మే ఈయూలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక తాజాగా కోవీషీల్డ్ ను కూడా గుర్తించడంతో ఇది ఈయూ గుర్తించిన ఐదవ టీకాగా ఎంపికైంది. భారత్ హెచ్చరికల నేపథ్యంలో ఈయూలోని ఏడు దేశాలు ప్రస్తుతానికి దిగి వ‌చ్చాయి. మిగ‌తా దేశాల విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles