రైలు పట్టాలను దాటుకుంటూ అవతలి ఫ్లాట్ ఫాంలపైకి వెళ్లరాదు.. కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్ ఫామ్ పై ట్రాక్ కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా పెడచెవిన పెట్టడం మనవారికి అలవాటే. జరగరానిది జరిగిన సందర్భంలో అయ్యో అంటూ ఓ నిట్టూర్పు విసిరి.. ఆ తరువాత మళ్లీ మొదటికి వచ్చేస్తారు. సరిగ్గా రైలు కదిలిన తరువాత.. వేగం పుంజుకునే సమయంలోనే దిగడం లేదా ఎక్కడం చేస్తుంటారు. రైలు స్టేషన్ కు చేరుకునే సమయంలోనే అవతలి ఫ్లాట్ ఫామ్ లకు చేరుకునేందుకు పట్టాలపై కుస్తీకి దిగుతారు.
రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ.. తమకు తాము ప్రమాదం తెచ్చుకుంటారు. పలు సందర్భాలలో పలువురికి ప్రమాదాన్ని తీసుకోస్తుంటారు. అటువంటి ఘటనలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రెండ్రోజులక్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బోరివల్లి రైల్వే స్టేషన్ వద్ద వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు.. ప్రాణాలపైకి తెచ్చుకన్నాడు. అదృష్టం బాగుండి సమయానికి రైల్వే కానిస్టేబుల్ లాగడంతో బతికి బయటపడ్డాడు.
అదే కానిస్టేబుల్ గమనించి ఉండకపోతే చెట్టంత మనిషి ప్రాణాలు పోయేవి. వేగంగా నడుస్తోన్న రైలులోంచి దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి దిగుతూ బ్యాలెన్స్ తప్పి సదరు వ్యక్తి కింద పడిపోయాడు. రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్య ఉన్న గ్యాప్ చివర్లో పడిపోగా.. వెంటనే అలర్ట్ అయిన అక్కడి రైల్వే పోలీస్ కానిస్టేబుల్.. పరిగెత్తి ప్రయాణికుడ్ని రైలుకు దూరంగా లాగడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన సీసీఫుటేజ్ వీడియోను రైల్వేశాఖ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఇలా చేయడం ఎంతో ప్రమాదమని.. అంతేకాదు నేరం కూడా అని హెచ్చరించింది. రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ను అభినందించింది.
#WATCH | An RPF constable saved life of a passenger who fell while trying to get down from a running at Mumbai's Borivali Railway Station on June 29. The passenger was dangerously close to the gap between the train & platform when the constable pulled him away: Central Railway pic.twitter.com/AVnYIwNQ7y
— ANI (@ANI) July 1, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more