Relief for Amaravati MP In Caste Certificate Issue అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంలో ఊరట

Sc stays hc judgment that cancelled mp navneet rana s caste certificate

Supreme Court, SC on Navneet Kaur-Rana, fake caste certificate, fake caste certificate navneet kaur, amravati mp, amravati mp fake caste certificate, Navneet Kaur-Rana, bombay high court, mumbai news, mumbai latest news, Mumbai, Maharashtra, Politics, crime

The Supreme Court has stayed a Bombay High Court judgment which had cancelled the “wrong caste certificate” obtained by Amravati MP Navneet Kaur-Rana. Since Kaur-Rana, an Independent candidate, had won from a constituency which was reserved for members of the Scheduled Caste community, the Bombay HC order meant that she was in danger of losing her seat.

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంలో ఊరట

Posted: 06/22/2021 05:09 PM IST
Sc stays hc judgment that cancelled mp navneet rana s caste certificate

మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తాత్కలిక ఊరట లభించింది. అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జూన్ 8న బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ రాణా కుల ధృవీకరణ పత్రం రద్దు చేయడంతో పాటు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే.

అయితే బాంబే హైకోర్టు తీర్పును నవనీత్ కౌర్ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తానని అప్పుడే చెప్పిన ప్రకారం సుప్రింకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అమె దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ దినేశ్ మహేశ్వరీ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. మహారాష్ట్రతో పాటు అమెపై న్యాయస్థానంలో పిటీషన్ వేసిన ఆనంద్ రావు అ్సులేకు నోటీసులు జారీ చేసింది. తాము జారీ చేసిన నోటీసులపై కేసు తదుపరి విచారణ తేదీలోగా కౌంటర్ ఇవ్వాలని మహారాష్ట్రతో పాటు ఆనంద్ రావు అద్సులేలను అదేశించింది. స్టే విధించడంతో అమెకు న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది.

అసలేం జరిగిందంటే.. అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ కౌర్ గెలుపోందింది. అయితే అమె అసలు ఎస్సీ కులానికి చెందినది కాదని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించి అమె ఎన్నికలలో గెలిచారని అమె చేతిలో ఓటమి పాలైన శివసేన అభ్యర్థి బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమె అసలు మోచి సామాజిక వర్గానికి చెందినది కాదని ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. జస్టిస్ ఆర్డీ ధనుకా, విజి బిష్ట్ లతో కూడిన డివిజన్ బెంచ్ అమె కుల ధృవీకరణ పత్రం చెల్లదని దానిని రద్దు చేసింది.

నవనీత్ కౌర్ మోచి కులానికి చెందని వ్యక్తి కాదని చెప్పిన హైకోర్టు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినందుకు గాను అమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే అంతకుముందు శివసేన నేత ఆనంద్ రావు ముంబై జిల్లా కుల ధృవీకరణ నిర్థారణ కమిటీలో పిర్యాదు చేయగా, అక్కడ కమిటీ నవనీత్ కౌర్ కు సానుకూలంగా నిర్ణయాన్ని తెలిపింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సవాలు చేస్తూ నవనీత్ కౌర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అమెకు ఊరట లభించింది. దీంతో అమె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ప్రస్తుతానికి ఎలాంటి నష్టం లేకుండా పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles