Birth, death registrations up in 2019 2019లో పుంజుకున్న జనన, మరణాల నమోదు

14 states uts achieved 100 level of birth registrations report

birth, death, recorded, increase, 2019, registration of births, registration of deaths, Civil Registration System, States, Union Territories, death Registrations, Telangana, Andhra Pradesh, National Commission, Ministry of Health & Family Welfare

The level of registration of births and deaths in the country improved in 2019, according to the “Vital Statistics of India Based on The Civil Registration System” report.

2019లో పుంజుకున్న జనన, మరణాల నమోదు

Posted: 06/19/2021 11:22 AM IST
14 states uts achieved 100 level of birth registrations report

దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2019లో తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లని ప్రకటించింది. ఇక ఇదే సమయంలో దేశంలో జనన, మరణాల నమోదు కూడా 2019లో పుంజుకుందని పేర్కోంది. 2019లో 2.67 కోట్ల జననాలు నమోదు కాగా, 83 లక్షల మంది చనిపోయారు. దేశంలో సగటున నిమిషానికి సగటున 51 మంది శిశువులు జన్మిస్తున్నారని తెలిపిన గణంకాలు.. అదే నిమిషానికి ఏకంగా 16 మంది కన్నుమూస్తున్నారని పేర్కోంది. దీంతో జనన, మరణాల నిష్పత్తి కూడా వత్యాసం కాసింత మెరుగైందని పేర్కొంది.

ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లుగా, తెలంగాణ జనాభా 3.72 కోట్లుగా నివేదిక పేర్కొంది. లింగ నిష్పత్తిలో ఏపీ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జననాల్లో కర్నూలు ముందుండగా, మరణాల్లో తూర్పుగోదావరి జిల్లా ముందున్నాయి. 2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది మరణించారు. మరణించిన వారితో పోలిస్తే జన్మించిన వారి సంఖ్య 88 శాతం అధికం. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం 2019 మధ్య నాటికి ఏపీ మొత్తం జనాభా 5,23,15,000.

ఇక, లింగ నిష్పత్తిలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. జనన సమయాల్లో  ఏపీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 935 మంది బాలికలే జన్మిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ 16వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణలో ఈ నిష్పత్తి 953గా ఉంది. ఫలితంగా ఏడో స్థానంలో నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్‌ ఈ విషయంలో అందరికంటే ముందుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 1024 మంది బాలికలు ఉన్నారు.  రెండో స్థానంలో ఉన్న నాగాలాండ్‌లో ఈ సంఖ్య 1001గా ఉంది. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో మిజోరం (975), అండమాన్ (965), కేరళ, ఉత్తరాఖండ్‌ (960), తెలంగాణ (953) నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles