Milkha Singh: India’s ‘Flying Sikh’ dies of COVID ఫ్లయింగ్ సింగ్, ప్రముఖ స్పింటర్ మిల్కా సింగ్ కన్నుమూత

Milkha singh legendary athlete popularly known as flying singh dies at 91

Milkha Singh, Milkha Singh news, Milkha Singh wife, Milkha Singh wife death, Milkha Singh RIP, RIP Milkha Singh, Milkha Singh death, Milkha Singh dead, Asian Gold Medalist, Nirmal Milkha Singh, Milkha Singh no more, Milkha Singh dies, Milkha SIngh latest news, Milkha SIngh death news, Milkha Singh death cause, Milkha Singh COVID-19, Sports News, Milkha covid, milkha death

Milkha Singh, the legendary athlete, and Asian gold medalist, popularly known as 'Flying Singh', has died at the age of 91. On June 13, Sunday, Nirmal Milkha Singh, former Indian volleyball captain, and Milkha Singh's wife had also breathed her last after suffering from COVID-19 and battling the virus for more than 19 days at a Mohali hospital.

ఫ్లయింగ్ సింగ్, ప్రముఖ స్పింటర్ మిల్కా సింగ్ కన్నుమూత

Posted: 06/19/2021 09:34 AM IST
Milkha singh legendary athlete popularly known as flying singh dies at 91

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఆయన కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనాతో బాధపడుతూ మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్‌కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. కాగా, మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈ నెల 13న మృతి చెందారు. 20 నవంబరు 1932లో నేటి పాకిస్థాన్ లోని పంజాబ్‌లోని గోవింద్‌పుర‌లో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు.

1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles