Can't Give Custody Of Minor 'Husband' To 'Wife': Allahabad HC బిడ్డకు తండ్రైన మైనర్ బాలుడు.. షెల్టర్ హోంకు తరలించిన కోర్టు

High court refuses to give custody of minor husband to wife

Allahabad High Court, Custody, Minor Husband, Adult Wife, Sanctioning Cohabitation, Adult and Child, POCSO Act, Justice J. J. Munir, Manish Kumar, Jyoti, Habeas Corpus, major wife, minor husband, Uttar Pradesh Crime

Noting that if a minor boy would be placed under the custody of his wife, it would be permitting an offence under the POCSO Act, the Allahabad High Court recently refused to give custody of a minor 'husband' to his 'wife'. The Bench of Justice J. J. Munir held that their marriage was voidable and if the minor boy is placed under the custody of his wife, it would amount to sanctioning cohabitation between a major and a minor.

బిడ్డకు తండ్రైన మైనర్ బాలుడు.. షెల్టర్ హోంకు తరలించిన కోర్టు

Posted: 06/16/2021 10:12 AM IST
High court refuses to give custody of minor husband to wife

ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరిచింది. తన ఎదుటకు వచ్చిన ఓ విచిత్రమైన కేసు విచారణించిన న్యాయస్థానం.. ఓ బిడ్డకు తండ్రి అయిన మైనర్ బాలుడ్ని భార్యకు అప్పగించడం సబబు కాదని షెల్డర్ హోంకు తరలించింది. విచారణ సందర్భగా మైనరయిన భర్తను తల్లితో వెళ్ళమని న్యాయస్థానం అదేశించగా, తాను భార్యతో వెళ్తానని అనడంతో న్యాయస్థానం అతడ్ని షెల్టర్ హోంకు తరలించింది. పోస్కో చట్టం కింద మైనర్ బాలుడ్ని భార్యకు అప్పగించటం చట్ట ప్రకారం కుదరదని తేల్చిచెప్పింది. మైనార్టీ తీరేంత వరకు బాలుడ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని షెల్టర్ హోం కు తరలించింది న్యాయస్థానం.

ఇన్నాళ్లు మైనర్ బాలికకు పెళ్లి… మైనర్ బాలికపై అత్యాచారం ఇలాంటి వార్తలు చూశాం.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని అజంగఢ్ లో నివసించే మైనర్ బాలుడు తన కంటే పెద్దదైన యువతితో సహజీవనం చేస్తూ ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడు తల్లి హౌషిలాదేవి కొడుకును తమతో పంపించమని అలహాబాద్ హై కోర్టులో గతేడాది పిటీషన్ దాఖలు చేసింది. 2020, సెప్టెంబర్18 న బాలుడ్ని కోర్టులో హాజరు పరిచారు. జస్టిస్ జేజే మునీర్ నేతృత్వంలోని ధర్మాసనం బాలుడి వాంగ్మూలం నమోదు చేసుకుంది. మైనర్ బాలుడు తన భార్యతో బలవంతంగా ఉంటున్నట్లు చెప్పలేదు.

ఇష్టపడే సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.  కేసు విచారణలో అతని భార్య భర్తను తనతో పంపించమని కోరింది. బాలుడు కూడా తన భార్యతోనే వెళతానని కోరాడు. కోర్టు అందుకు అంగీకరించలేదు. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వు చేసింది. అనంతరం ఈ ఏడాది మే 31 న తీర్పు వెలువరిస్తూ….మైనర్ బాలుడి  వివాహం చట్ట ప్రకారం చెల్లదు కాబట్టి… బాలుడ్ని మైనార్టీ తీరేంత వరకు ప్రభుత్వ సంరక్షణలోని షెల్టర్ హోంకు తరలించాలని ఆదేశించింది. 2022 ఫిబ్రవరి 4 తర్వాత, మైనార్టీ తీరాక  మరోసారి  బాలుడి వాంగ్మూలం నమోదుచేసి అతని ఇష్టం వచ్చిన వారివద్ద ఉండవచ్చని కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు కాపీలను అలహాబాద్ హై కోర్టు సోమవారం జూన్ 14న వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles