Local Leader arrested for harrassing woman journalist సెల్ఫీ వీడియోతో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

Local leader syed saleem arrested for harrassing woman journalist

woman journalist suicide attempt, MBT Leader harrassment, sayeed saleem social worker, AIMIM activists, MBT Leader, woman Journalist, suicide selfie, Rein Bazaar, Amjedullah Khan Khalid, Majlis Bachao Tehreek, Chandrayangutta, Hyderabad police, crime

The Chandrayangutta police have arrested Syed Saleem, a famous social worker of the old city from his residence for allgedly making a statement against a woman web journalist. During the arrest commotion prevailed near his residence after a group AIMIM activists tried to manhandle him.

స్థానిక నాయకుడి వేధింపులతో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

Posted: 06/14/2021 11:00 AM IST
Local leader syed saleem arrested for harrassing woman journalist

హైదరాబాద్ లో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ న్యూస్ చానల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఆత్మహత్యకు యత్నించారు. డబీర్ పురాకు చెందిన ఎంబీటీ నేత సయ్యద్ సలీం (66) వేధింపులకు గురిచేస్తున్నారంటూ అమె అరోపించారు. ఈ మేరకు అమె సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేదికలు ఎక్కగానే పత్రికా స్వేఛ్చ గురించి ప్రసంగాలు గుప్పించే నాయకులు.. వాస్తవంగా పత్రికలలో తమకు వ్యతిరేకంగా వచ్చే కథనాలను జీర్ణంచుకోలేక వేధింపులకు గురిచేస్తారని మరోమారు ఈ ఘటన రుజువుచేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ (37) ఓ న్యూస్ చానల్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. రాజకీయ నేతగా ఎంబీటీ నేత సలీం గతంలో ఓ పర్యాయం కలసిన ఇంటర్య్వూ చేసిన ఆమెపై కన్నువేశాడు. అతర్వాత కొద్ది రోజులుగా నుంచి ఆమెను అసభ్యంగా మాట్లాడి వేధిస్తున్నారు. అసభ్యకర వీడియోలు, ఫొటోలు  సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆయన వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.

నహీదా ఖాద్రీ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు. సలీం అరెస్ట్ విషయం తెలుసుకున్న మజ్లిస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని సలీంపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సలీం తనను వేధిస్తున్నట్టు బాధితురాలు ఖాద్రీ మే 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన నిందితుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెను దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ.. 20 రోజులుగా నరకం అనుభవిస్తున్నానని, తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ నిద్రమాత్రలు మింగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles