B’day party at farm house: 68 youngsters booked మందు, విందులతో సాఫ్ వేర్ ఇంజనీర్ల చిందులు

Police bust party with 67 guests in telangana s kadthal birthday boy on the run

Rave party in kadthal, Rave party in Box Container farm house, Rave party in farm house, Rave party in kadthal farm house, birthday party, varun goud, K Bharat, Box Container Farm House, Kadthal, lockdown violation, Rangareddy, Telangana, Crime

A group of 67 people was warned by the Kadthal police, Cyberabad jurisdiction, for celebrating a birthday party at a farmhouse while violating lockdown norms in the midnight hours of Saturday. The cops seized a copious amount of alcohol and sound systems used in the celebration.

లాక్ డౌన్ నిబంధనలు గాలికి.. మందు, విందులతో సాఫ్ వేర్ ఇంజనీర్ల చిందులు

Posted: 06/14/2021 10:02 AM IST
Police bust party with 67 guests in telangana s kadthal birthday boy on the run

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దేశవ్యాప్తంగా పాన్ డమిక్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదేశాలు జారీ చేసిన వేళ.. నిబంధనలకు నీళ్లు వదిలిన విద్యావంతులు జిల్లాలను దాటి మారుమూల ప్రాంతాలకు చేరుకుని అక్కడ గ్రాండ్ పార్టీలను సెలబ్రేట్ చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వరుణ్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గా జన్మదిన వేడుకలను స్నేహితులు మధ్య ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నగరంలోని రేవ్ పార్టీలను తలదన్నే విధంగా ఈ పార్టీ జరిగిందన్న అరోపణలు వున్నాయి.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి హైదరాబాద్ లోని వివిధ కంపెనీలకు చెందిన 70 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు, అమ్మాయిలతో కలసి డీజే శబ్దాల్లో చిందులేస్తూ హోరెత్తించారు. అయితే ఈ వేడుకల్లో తన స్నేహితులకు కిక్ ఎక్కించేందుకు నిర్వాహకులతో కలసి వరుణ్ గౌడ్ బయట నుంచి యువతులను తెప్పించారని కూడా సమాచారం. వారితో కలసి తన స్నేహితులు మద్యం తాగిన మత్తులో చిందులేశారని పోలీసులు తెలిపారు. గ్రామస్థుల నుంచి అందుకున్న సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

రాత్రి 12 గంటల సమయంలో ఘటనాస్థలానికి వెళ్లిన కడ్తాల్ పోలీసులు బాక్స్ కంటైనర్ ఫాం హౌస్ పై దాడి చేశారు. ఫామ్ హౌజ్ లోని నిర్వాహకులతో కలసి మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే కీలక వ్యక్తులైన వరుణ్ గౌడ్ తో పాటు మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు నిర్వాహకులు వున్నారు. వారు కాకుండా పోలీసుల అదుపులో ఉన్నవారిలో 21 మంది యువతులు, 43 మంది యువకులు ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ పరారయ్యాడు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన యువతీయువకులను ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles