Twist in Kurnool Adoni hospital infant kidnap case అధోని శిశువు కిడ్నాప్ కేసులో ఇంటి దొంగల పాత్ర..

Kurnool police investigating adoni hospital staff in infant kidnap case

Adhoni Hospital, Kurnool infant kidnap, just born baby, Burukha, Burkha lady, Kidnap case, Nurse, Kurnool, Andhra Pradesh, Crime

Kurnool Police investigating Adoni Hospital staff in Infant Kidnap case, they suspect hospital staff nurse hand in this case, they suspect staff help is involved in the kidnap case.

అధోని శిశువు కిడ్నాప్ కేసు: మరో కోణంలో విచారిస్తున్న పోలీసులు

Posted: 06/05/2021 10:44 AM IST
Kurnool police investigating adoni hospital staff in infant kidnap case

దేశంలో ఓ వైపు కరోనా విజృంభన కొనసాగుతున్నా.. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన శిశువుల కిడ్నాపింగ్ మాత్రం అగడం లేదు. లాక్ డౌన్ విధించినా, కర్ప్యూలు అములపర్చినా.. కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ కట్టడి చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శిశువును అమాంతం ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో జరిగిన శిశువు కిడ్నాప్ కేసులో మరో ట్విస్టు బయటపడింది. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. శిశువు కిడ్నాప్ కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.

బురఖా వేసుకున్న మహిళతో కలిసి నర్సే చిన్నారిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులు క్రితం ఆదోని ఆసుపత్రిలో ప్రసవించిన మహిళ పాపను కనిపించకుండాపోయిన ఘటన సంచలన కలిగించింది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా బురఖా వేసుకున్న మహిళ కనిపించింది. కానీ క్లియర్ గా దృశ్యాలు కనిపించకపోవటంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు చేపట్టారు.

రెండురోజుల సస్పెన్స్ అనంతరం పోలీసులు కేసులో నిందితులను పూర్తిగా గుర్తించకపోయినా గానీ..పాపను మాత్రం సురక్షితంగా దక్కించుకుని తల్లికి అందజేశారు. బురఖా వేసుకున్న మహిళే పాపను నర్సు సహాయంతో ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలా ఎత్తుకెళ్లిన పాపను ఓ దంపతులకు రూ.50 వేలకు అమ్మినట్లుగా తేలింది. పాపను కొనుక్కుకున్న దంపతులు ఓ నర్సు మాకు ఈ బిడ్డను అమ్మిందని చెప్పటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా ముగ్గురు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మందగిరి ప్రాంతంలోని దంపతులకు అమ్మినట్లుగా తెలుసుకున్న పోలీసులు వారి నుంచి పాపను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. కానీ ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అనే విషయం మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. దీంతో పోలీసులు ఈ కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు?ఇంకా ఎంతమంది ఉన్నారు? పాపను కిడ్నాప్ చేయించాల్సి అవసరం ఎవరికి ఉంది? ఓగ్యాంగ్ ఉందా? ఇంకా ఎంతమంది శిశువులను కిడ్నాప్ లు చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆదోనితో పాటు మొత్తం జిల్లాను జల్లెడ పడుతున్నారు. సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles