Hospital fined ₹22 lakh for violating Aarogyasri rules జరిమానా పడ్డాక.. డబ్బును తిరిగిచ్చిన ఆసుపత్రి యాజమాన్యం

Hospital managment returns money to aarogyasri card holders collected during treatment

Coronavirus, Covid patients, Covid Treatment, private hospitals, Aarogyasri, Inodaya Hospital, violating Aarogyasri rules, exorbitant fees, MLA Dwarampudi Chandrasekhar Reddy, Kakinada, AP News, Andhra Pradesh, crime

Private hospitals have been booked for violation of Covid norms including excess charges and denial of Aarogyasri scheme etc while providing medical treatment to the Covid affected patients in the district. Joint Collector Dr G Lakshmisha imposed fine for five times on the Inodaya Hospital, Kakinada for collecting fee from the Covid patients having Arogyasri card.

జరిమానా వడ్డించాక.. డబ్బును తిరిగిచ్చిన ఆసుపత్రి యాజమాన్యం

Posted: 06/05/2021 09:52 AM IST
Hospital managment returns money to aarogyasri card holders collected during treatment

ప్రభుత్వ ఆసుపత్రల్లో తామ వారిని సరిగ్గా పట్టించుకోరని అపవాదు వుండటంతో ప్రైవేటు అసుపత్రులైతే తమ వారిని కాసింత పట్టించుకుంటాయని, కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ.. పలువురు ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే కరోనాను కూడా అరోగ్య శ్రీ కింది చికిత్స అందించేందుకు అనుమతించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉదారతను అంతే చిత్తశుద్దితో చికిత్స అందించాల్సిన ప్రైవేటు అసుపత్రులు.. అటు ప్రభుత్వం నుంచి డబ్బును పోందడంతో పాటు ఇటు రోగి బంధువుల నుంచి కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి.

దీంతో లక్షల్లో డబ్బులు వసూలు చెయ్యడమే కాదు. డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడలో ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేసి కూడా.. రోగి బంధువుల నుంచి లక్షల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో చేతులు కాలిన తరువాత అకులు పట్టుకున్న చందంగా రోగి నుంచి వసూలు చేసిన నాలుగన్నర లక్షల రూపాయలను ఆసుపత్రి యాజమాన్యం బాధితుని బంధువులకు అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేసి కూడా.. వారి బంధువుల నుంచి అక్రమంగా 4లక్షల 50వేల రూపాయలను వసూలు చేసింది.

అంతేకాదు.. మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. తమ కుటుంబసభ్యుడి అరోగ్యమే పరమావదిగా భావించిన రోగులు ముందుగా నాలుగున్నర లక్షల డబ్బును చెల్లించారు. అయినా మరో లక్షన్నర రూపాయల కోసం బాదితుడి కుటుంబసభ్యులను అసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయడంతో బాధితులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి 22లక్షల 50వేల రూపాయల పెనాల్టీ వేశారు. తాము చేసిన తప్పును ఆలస్యంగా దిద్దుకున్న ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు వారి డబ్బును చెల్లించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles