Wellknown actor acuses former TN minister of 'rape' తమిళనాడు మాజీ మంత్రిపై ప్రముఖ నటి ఫిర్యాదు

Tamil actor accuses former minister of cheating her after a 5 year relationship

Shantini Theva, Wellknown actor, Former AIADMK minister M Manikandan, Manikandan Shantini, Chandhini, Manikandan Minister news, Minister cheating, Minister extra-marital affair, Manikandan Minister for Information Techonology, Abortion, Sexual abuse, Extra-marital affair, Tamil Nadu, Crime

A Tamil actor has filed a complaint against a former Tamil Nadu minister, accusing him of cheating on her after being in a relationship with her for five years. Shantini Theva accused former AIADMK minister M Manikandan of promising to marry her and then abandoning her after she got pregnant.

పెళ్లి చేసుకుంటానని మోసం: తమిళనాడు మాజీ మంత్రిపై ప్రముఖ నటి ఫిర్యాదు

Posted: 05/29/2021 12:12 PM IST
Tamil actor accuses former minister of cheating her after a 5 year relationship

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం.మణికందన్‌పై మలేసియాకు చెందిన భారత సంతతి మహిళ, తమిళ నటి శాంతిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ మధ్య ఐదేళ్లపాటు ‘రిలేషన్‌షిప్’ కొనసాగిందని, ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, తాను గర్భవతిని అయిన తర్వాత మోసం చేశాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకు తనను, మలేసియాలో ఉన్న తన కుటుంబాన్ని బెదిరించాడని పేర్కొంది.

‘నాదోడిగల్’ సినిమాలో నటించిన శాంతిని మలేసియా టూరిజంలో పనిచేస్తున్న సమయంలో తరచూ చెన్నై వచ్చేది.  2017లో తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న సమయంలో శాంతినితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె వద్ద మంత్రి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పటికే ఆయనకు పెళ్లయినప్పటికీ తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చారని, దాంతో ఇద్దరం కలిసి బీసెంట్ నగర్‌లో ఓ ఇంట్లో ఉండేవాళ్లమని ఆమె తెలిపింది.

మణికందన్ తనతో కలిసి ఉన్నారని చెప్పేందుకు సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భవతిని అయ్యానని, అయితే అధికారికంగా పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లల్ని కందామని అబార్షన్ చేయించాడని శాంతిని పేర్కొంది. ఇప్పుడు దేశం విడిచి వెళ్లకపోతే ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. అయితే, శాంతిని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మణికందన్ కొట్టిపారేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles