Price of DRDO’s 2DG anti-Covid drug fixed at ₹990 డీఆర్డీవో 2డిజీ కరోనా మందుకు ధర ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్

Dr reddy s fixed price of drdo s 2dg anti covid drug fixed at 990

Dr Reddys fixes 2DG drug price, DRDO fixes 2DG drug price, DRDO’s 2DG anti-Covid drug, 2DG, DRDO, Covid drug, 2 Deoxy 2 Glucose drug, Oral drug, Dr Reddy, 2Dg drug price, 2 DG Covid drug price, Covid, Coronavirus

Dr Reddy’s has fixed the price of DRDO’s 2DG anti-Covid drug at ₹990 per sachet. However, the pharma company would provide the drug to the government hospitals, central and state governments at a discounted price.

డీఆర్డీవో 2డిజీ కరోనా మందుకు ధర ఫిక్స్ చేసిన డాక్టర్ రెడ్డీస్

Posted: 05/29/2021 10:51 AM IST
Dr reddy s fixed price of drdo s 2dg anti covid drug fixed at 990

కరోనా వైరస్ మహమ్మారి పీచమణచేలా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) 2-డీజీ మందును రూపోందించిన విషయం తెలిసిందే. ఇక దీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఉత్పత్తి చేయడంతో పాటు మార్కెటింగ్ కూడా చస్తున్న సంస్థ డాక్డర్ రెడ్డీస్ అన్న విషయం కూడా ఇప్పటికే తెలిసిందే. అటు డీఆర్డీఓ తో కలసి సంయుక్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫార్మ సంస్థ కూడా ఈ మందును రూపోందించేందుకు తమ వంతు సహాకారాన్ని అందించింది, దీంతో దేశవ్యాప్తంగా ఈ మందును ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యతలను డాక్టర్ రెడ్డీస్ తన భుజాలపై వేసుకుంది. ఈ క్రమంలో ఈ మందుకు ధర ఖరారు చేసింది డాక్డర్ రెడ్డీస్,

మనిషి శరీరంలోకి చేరిన వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెందడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనిషి ప్రాణాలను రోజుల వ్యవధిలోనే కబళిస్తోంది. దీంతో అదే స్థాయిలో వైరస్ ను బూరడీ కొట్టించి.. బాధితులను అరోగ్యవంతంగా తీర్చిదిద్దగలడం ఈ 2డిజీ ఔషదం గొప్పతనం. అయితే ఇంతలా బురిడీ కొట్టించి కరోనా వైరస్ బారిన పడిన తొలి, మధ్య ధశలోని బాధితుకు ఇది పూర్తి అరోగ్యవంతులుగా తీర్చిదిద్దగలుతోంది. అయితే ధర ఎంత అంటారా.. ఈ మందు  ఒక్కో సాచెట్ ధరను రూ. 990గా నిర్ణయించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్. పొడి రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ మందు ఒక్కో సాచెట్‌ ధరను రూ. 990గా నిర్ణయించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు దీనిని రాయితీ ధరల్లో అందించనున్నారు. ఈ మందు తీసుకున్న వారికి ఆక్సిజన్ అవసరం లేకుండా వేగంగా కోలుకుంటారని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అత్యవసర వినియోగానికి ఇప్పటికే దీనికి అనుమతి లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన ఈ మందు తొలి బ్యాచ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల అధికారికంగా విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles