Chiranjeevi demands Bharat Ratna for NT RamaRao ఎన్టీఆర్ 98వ జయంతి: భారతరత్న ఇవ్వాలన్న చిరు..

Legendary actor ntr jayanthi fans pay tribute to the actor on his birth anniversary

Balakrishna NTR Ghat, NT RamaRao 98 Birth Anniversary, Nandamuri Taraka Ramarao, BalaKrishna, Ramakrishna, Junior NTR, NTR Ghat, Twitter, Chiranjeevi, Lockdown, Hyderabad, Telangana, Tollywood

Nandamuri Taraka Rama Rao was an actor, producer, director, film editor, and also politician. He served as the Chief Minister of Andhra Pradesh for seven years over three terms. He was the 10th CM of AP. The contribution of the Telugu legend to the industry is huge and he still has a huge fanbase.

ఎన్టీఆర్ 98వ జయంతి: కుటుంబసభ్యుల నివాళులు.. భారతరత్న ఇవ్వాలన్న చిరు..

Posted: 05/28/2021 12:59 PM IST
Legendary actor ntr jayanthi fans pay tribute to the actor on his birth anniversary

ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పాలిట పెన్నిధని బాలయ్య పేర్కొన్నారు. యుగానికి ఒక్కరే మహానుభావులు జన్మిస్తారని.. వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుందని అన్నారు. మహానుభావుల ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి కలిగిస్తాయని, వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయన్నారు.

అలాంటి అరుదైన కోవకి చెందిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయ‌న పేర్కొన్నారు. తెలుగు ప్రజలు అన్నా అని ఆర్తిగా పిలుచుకున్నా.. తరాలు మారుతున్నా తరగని కీర్తి ఆర్జించిన ఎన్టీఆర్ కే సాథ్యమైందని నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.

'మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా..' అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోప‌క తెలుగు ధ‌రిత్రి చిన్న‌బోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె త‌ల్ల‌డిల్లిపోతోంది. పెద్ద మ‌న‌సుతో ఈ ధ‌రిత్రిని, ఈ గుండెను మ‌రొక్క‌సారి తాకిపో తాతా..' అంటూ ఎన్టీఆర్ అన్నారు. నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి.. ఆయ‌న సేవ‌ల‌ను స్మరించుకుంటున్నారు. కాగా, కరోనా కారణంగా ఈసారి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడానికి రాలేకపోతున్నానని ఎన్టీఆర్ మరో తనయుడు రామకృష్ణ తెలిపారు. అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయ‌న‌కు భార‌తర‌త్న ఇవ్వాల‌ని కోరారు. మ‌న తెలుగు తేజం, దేశం గ‌ర్వించే నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావుకు భార‌త‌రత్న ఇస్తే అది తెలుగు వారంద‌రికీ గ‌ర్వ కార‌ణమ‌ని చిరంజీవి పేర్కొన్నారు. నూర‌వ జ‌యంతి ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా ఎన్టీఆర్ కు ఈ గౌర‌వం ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆ మ‌హానుభావుడి 98వ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా స్మ‌రించుకుంటున్నాన‌ని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ కు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles