Rear indian grey hornbill bird caught on camera నల్లమలలో కెమెరాకు చిక్కిన ‘అడవి రైతు’ పక్షి..

Rear indian grey hornbill bird caught on camera

Rear indian grey hornbill bird, indian grey hornbill in Nallamala, Indian grey hornbill caught on camera, indian grey hornbill in Nallamala forest, indian grey hornbill wood cutter family, Indian grey hornbill bird, Nalgonda, chandampeta Nallamala forest, wood cutter family, camera

Rear indian grey hornbill bird caught on camera in Nallamala forest, it belongs to wood cutter family

నల్లమలలో కెమెరాకు చిక్కిన ‘అడవి రైతు’ పక్షి..

Posted: 05/28/2021 11:53 AM IST
Rear indian grey hornbill bird caught on camera

తెలంగాణ క్రమంగా అరుదైన పక్షులకు ఆలవాలంగా మారుతోంది. ఇటీవల అదిలాబాద్ జిల్లాలో విదేశీ పక్షులు వచ్చి సేద తీరి తిరుగుపయనం కాగా, అంతకుముందు దాదాపుగా అంతరించి పోయాయని అనుకున్న పక్షులు కూడా కనిపించగా, వాటిని అటవీ అధికారులు తమ కెమెరాల్లో బంధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో సందడి చేసింది. నిజానికి ఇవి భారత ఉప ఖండంలో మాత్రమే కనిపిస్తాయి. వడ్రంగి పిట్టల జాతీకి చెందిన ఈ అరుదైన అడవి రైతు పక్షి తెలంగాణలో కనిపించింది.

నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో నిన్న ఇది అటవీశాఖ కెమెరాకు చిక్కింది. ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కు, పొడవైన తోక వుంటాయని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వరరావు, చందంపేట అటవీ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్లపైన, అడవిలోని కొండలు, గుట్టలపైనే సంచరిస్తుందని చెప్పారు. అత్తిపండ్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ పక్షిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles