Cyclone Tauktae: Severe flood predicted in Kerala, TN ముంచుకొస్తున్న 'తౌక్టే' ప్రళయం.. కేరళ, తమిళనాడులో అప్రమత్తం..

Cyclone tauktae severe flood situation in keralas pathanamthitta as cyclonic storm intensifies

Indian Meteorological Department (IMD), cyclone, Cyclone Tauktae, Lakshadweep islands, Maldives, Kerala, Karnataka, Goa, Maharashtra, Gujarat, Telangana, Andhra Pradesh, crime

The India Meteorological Department (IMD) had said that the depression in the Arabian Sea intensified into a 'very severe cyclonic storm' on May 17 and cross the Gujarat coast a day later. The impact of the cyclone will be felt in Lakshadweep islands, Maldives area, triggering heavy rainfall in Kerala, Karnataka, Goa, Maharashtra, Gujarat and also the coastal & adjoining districts of all these states.

ముంచుకొస్తున్న ‘తౌక్టే’ ప్రళయం.. కేరళ, తమిళనాడులో అప్రమత్తం..

Posted: 05/15/2021 12:39 PM IST
Cyclone tauktae severe flood situation in keralas pathanamthitta as cyclonic storm intensifies

అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా వేగాన్ని పెంచుకుని తుపానుగా, ఆపై పెను తుఫానుగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం కేరళలోని కన్నూర్ ప్రాంతానికి 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తౌక్టేగా నామకరణం చేసిన ఈ తుఫాను అదివారం మరింత తవ్రంగా మారుతుందని, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. తౌక్టే తుపాను పెను తుపానుగా మారి తీరం దాటే సమయంలో మహా ప్రళయంగా సంభవించనుందని హెచ్చరించింది.

తీరం దాటే సమయంలో గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. ‘తౌక్టే’ తుపాను కారణంగా కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ధాటికి ఇప్పటికే కొల్లాం జిల్లాలోని అనేక చోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అనేక చోట్ల చెట్టు నేలకూలయి. వందలాది ఇళ్లు కూడా ద్వంసమయ్యాయి.

ఏకభిగిన కురుస్తున్న వర్షాలతో కొండచరియలు అధికంగా వున్న  వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో ప్రాణనష్టం వాటిల్లకుండా జిల్లా అధికారులు రాష్ట్రప్రభుత్వాల అదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికారులు కూడా ఆయా జిల్లాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. తుపాను ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించారు, ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు.

'తౌక్టే' ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 15, 16 తేదీల్లో తెలంగాణ నైరుతి జిల్లాల్లో అధికంగా వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శని, ఆదివారల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారి వర్షాలు పడే అవకాశముందని అన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈ రెండు రోజులు 3040 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  Cyclone Tauktae  Lakshadweep islands  Kerala  Karnataka  Goa  Maharashtra  Gujarat  Telangana  

Other Articles