'Who is behind you.?' CID questions RRR మీ వెనుకున్నది ఎవరు? రఘురామకృష్ణరాజును విచారించిన పోలీసులు

Ysrcp mp raghu rama krishna raju taken to cid office and questioned

Raghu Rama Krishna Raju, Narsapur MP, member of parliament Narsapur, Hate Speeches, PV Sunil Kumar, Additonal DG CID, Conspiracy, media channels, AP CID, CM YS Jagan, YSRCP, CRPF Security, Andhra pradesh, CRIME

Rebel YSRCP MP Raghu Rama Krishna Raju brought to Andhra Pradesh CID office in Guntur last night. He was questioned by the CID officials in sedition case after he got arrested from his residence in Hyderabad on May 14 in a case under provisions of IPC on the allegations that he acted in a way detrimental to the prestige of the state government

మీ వెనుకున్నది ఎవరు? రఘురామకృష్ణరాజును విచారించిన పోలీసులు

Posted: 05/15/2021 11:48 AM IST
Ysrcp mp raghu rama krishna raju taken to cid office and questioned

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్యవహరిస్తున్నారని, దారుణ విమర్శలు చేస్తూ కించపరుస్తున్నారన్ననేరారోపణలపై న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఆయనతో పాటు ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాఘురామకృష్ణ రాజును రాత్రి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించిన సిఐడి అధికారులు.. ఆయనను పలు కోణాల్లో విచారించారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ స్వయంగా గుంటూరు ఆఫీసుకి వెళ్లి ఆర్థరాత్రి వరకు అక్కడే వున్నా ఆయన రఘురామను విచారించిన్నట్టు సమాచారం.

ప్రభుత్వాన్ని కించపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించిన అధికారులు.. కుట్రపూరితంగా ఎందుక వ్యవహరిస్తున్నారని, ఇందుకుగాను ఆయన వెనుకనుండి నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అయితే సీఐడీ అధికారుల తీరుపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే కేసులో ఇరికించిందని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ వింగ్ లో ఉన్న తనను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు రఘురామ వాదిస్తున్నారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల స‌మాచారం, సాంకేతిక స‌హ‌కారం ఎవ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్న‌లు వేశారు. ఈ విష‌యాల్లో ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌ని ప్రశ్నలను సంధించారని సమాచారం.

ఇవాళ ఉదయం సీఐడీ కార్యాల‌యంలోనే రఘురామ కృష్ణ రాజుకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఎంపీకి అవ‌స‌ర‌మైన మందులు, అల్పాహారాన్ని ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది సీఐడీ కార్యాల‌యంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు వాటిని ఎంపీకి అంద‌జేశారు. గుంటూరులోని ప్రాంతీయ కార్యాల‌యంలో ర‌ఘురామ‌కృష్ణ‌రాజును సీఐడీ చేస్తున్న విచార‌ణ కొన‌సాగుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారంటూ ర‌ఘురామ‌రాజుపై రాజద్రోహం(124a) కేసు పెట్టిన సీఐడీ.. ఏ1గా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, ఏ2‌, ఏ3గా ఛాన‌ళ్లపై ఎఫ్ఐఆర్‌ న‌మోదు చేసింది. విచార‌ణ పూర్తి అయ్యే వ‌ర‌కు ఎంపీని మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌వ‌ద్ద‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghu Rama Krishna Raju  Narsapur MP  AP CID  CM YS Jagan  YSRCP  CRPF Security  Andhra pradesh  CRIME  

Other Articles