This is result of mixing 2 COVID Vaccine Shots కరోనా వాక్సీన్ కాక్ టైల్ అయితే: రెండు వేర్వేరు టీకాలతో ఇదీ ఫలితం.!

Vaccine cocktail will mix and match of two covid 19 jabs defend coronavirus

Covid-19 vaccines, COVID shots, mixing two covid vaccines, what happens when you get two different corona vaccine, covid vaccine side effects, covid 19 vaccines, corona vaccine, covaxin, covisheild, Oxford University, Research, Astrazenica, Pfizer, covid-19

Mixing doses of two leading Covid-19 vaccines increased patients' side effects such as fatigue and headaches in early findings from a study that has yet to show how well such a cocktail defends against coronavirus.

కరోనా వాక్సీన్ కాక్ టైల్ అయితే: రెండు వేర్వేరు టీకాలతో ఇదీ ఫలితం.!

Posted: 05/13/2021 11:38 PM IST
Vaccine cocktail will mix and match of two covid 19 jabs defend coronavirus

కాక్ టెయిల్ ఈ పధం ఎక్కువగా పబ్ కల్చర్ కు అలవాటు పడిన వాళ్లకు పరచయం ఉంటుంది. పలు రకాల మధ్యాన్ని ఒకే పెగ్గులో కలుపుకుని తాగడమే కాక్ టెయిల్. అయితే వాక్సీన్ కాక్ టెయిల్ అంటే ఏమిటీ.. అన్న ప్రశ్న ఉదయించక తప్పదు. అయితే తొలి కరోనా టీకా కోవాగ్జీన్ తీసుకుని.. రెండో సారి మాత్రం కొవిషీల్డ్ తీసుకుంటే.. అదే వాక్సీన్ కాక్ టెయిల్. కానీ ఇలా ఎవరైనా తీసుకుంటారా.? అంటే భారతదేశంలోని నిరక్షరాస్యులు, వయోవృద్దులు ఎంతో మంది టీకాను ఇదివరకే తీసుకున్నారు. వీరే కాదు అనేక మంది అక్షరాస్యులు కూడా టీకా తీసుకున్నారు. కానీ వారు ఏ టీకా తీసుకున్నారో వారికే తెలియదు.

అయితే ప్రభుత్వాలు మాత్రం టీకా తీసుకునే ప్రజలందరికీ తొలి డోసు కరోనా వాగ్జీన్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలని సూచనలు చేసింది. తొలి డోస్ కోవీషీల్డ్ తీసుకుంటే రెండో డోస్ కూడా కోవీషీల్డ్ మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మొదట ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి ప్రపంచం దేశాలూ తమ దేశ ప్రజలకు ఇదే సూచనను చేశాయి ఎందుకంటే రెండో డోస్ మారితే వాగ్జీన్ ప్రభావం ఎలా వుంటుందన్న విషయాన్ని పక్కన బెడితే అది ప్రమాదకరంగా మారవచ్చునన్న అందోళన కూడా ప్రభుత్వాలలో నెలకోన్నాయి.

అయితే కొందరు ఇలానే మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ .. రెండో డోస్ మరో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అది మన దేశంలో కాదులేండీ.. అయినా వారికెంత వరకు సురక్షితంగా వున్నారు.? అందువల్ల ఎలాంటి నష్టాలు కలిగాయి.? అన్న విషయమై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి అధ్యయనం చేసింది. ఇలా వేర్వేరు వాక్సీన్ డోసులు తీసుకోవడం వల్ల కాసింత ఒళ్లు నోప్పులు, జ్వరం తప్ప పెద్దగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక డోస్ ఆస్ట్రాజెనెకా, మరో డోస్ ఫైజర్ టీకాలు తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇలా టీకాలు తీసుకున్న 10 శాతం మందిలో తీవ్రమైన అలసట ఉన్నట్టు గుర్తించారు.

దాంతో పాటు తలనొప్పి, జ్వరం వంటి సహజమైన లక్షణాలూ చాలా మందిలో కనిపించాయని తేల్చారు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులేం లేవని, ఒకట్రెండు రోజుల్లోనే అంతా సాధారణమైపోయిందని చెప్పారు. అయితే, ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే అలసట తీవ్రత కొంచెం ఎక్కువని తేల్చారు. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అలసట కేవలం 3 శాతం మందిలోనే ఉందన్నారు. ప్రస్తుతం అధ్యయనంలో పాల్గొన్నది 50 ఏళ్లకు పైబడినవారేనని, యువతలో అలసట ఇంకొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona vaccine  covaxin  covisheild  Oxford University  Research  Astrazenica  Pfizer  covid-19  

Other Articles